ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు జాతీయ అవార్డు
ABN, First Publish Date - 2023-10-30T02:54:44+05:30
ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్ డే పురస్కరించుకుని వాయిస్ ఆఫ్ హెల్త్ కేర్ అనే జాతీయ సంస్థ అహ్మదాబాద్‌లో ఈ నెల 27న నిర్వహించిన నేషనల్ స్ట్రోక్ కాన్‌క్లేవ్ 2023 సదస్సులో ‘బెస్ట్ స్ట్రోక్ అవేర్‌నెస్ అడ్వకేట్ హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్’గా గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు జాతీయస్థాయి అవార్డును అందజేసినట్టు ఆస్పత్రి చీఫ్ న్యూరాలజిస్ట్ రిటైర్డ్ మేజర్ జనరల్ డాక్టర్ ఎస్.కుమారవేలు తెలిపారు.
పక్షవాత రోగులకు అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపు
చీఫ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమారవేలు వెల్లడి
గుంటూరు(మెడికల్), అక్టోబరు 29: ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్ డే పురస్కరించుకుని వాయిస్ ఆఫ్ హెల్త్ కేర్ అనే జాతీయ సంస్థ అహ్మదాబాద్‌లో ఈ నెల 27న నిర్వహించిన నేషనల్ స్ట్రోక్ కాన్‌క్లేవ్ 2023 సదస్సులో ‘బెస్ట్ స్ట్రోక్ అవేర్‌నెస్ అడ్వకేట్ హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్’గా గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు జాతీయస్థాయి అవార్డును అందజేసినట్టు ఆస్పత్రి చీఫ్ న్యూరాలజిస్ట్ రిటైర్డ్ మేజర్ జనరల్ డాక్టర్ ఎస్.కుమారవేలు తెలిపారు. ఆదివారం గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాన్‌క్లేవ్‌లో ముఖ్యఅతిథిగా హాజరైన గుజరాత్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ గణే్‌షబాయ్ పటేల్ నుంచి రమేష్ హాస్పిటల్ తరపున తాను ఈ పురస్కారం అందుకున్నట్టు కుమారవేలు తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాల సంస్థ జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ) ఏపీలో గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్‌కు ఈ మధ్య కాలంలో అత్యున్నత వైద్యసేవలు అందించే హాస్పిటల్స్‌కు ఇచ్చే గుర్తింపును రెండోసారి ఇచ్చినట్టు తెలిపారు. పక్షవాతరోగులకు మెరుగైన వైద్యసేవలు అందించినందుకుగాను, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన క్వాలిటీ అండ్ ఎక్రిడేషన్ ఇనిస్టిట్యూట్‌లో దేశం మొత్తం మీద ఆరు స్ట్రోక్ సెంటర్లకు గుర్తింపు ఇవ్వగా, ఇందులో రమేష్ హాస్పిటల్ ఒకటని వెల్లడించారు. పక్షవాతం సంభవించిన మొదటి గంటలో స్ట్రోక్ సెంటర్‌లో చేర్చి వైద్యం అందిస్తే రోగులు 95 శాతం సాధారణ స్థితికి వస్తారన్నారు. కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్.బాలకృష్ణ, బిజినెస్ డెవల్‌పమెంట్ హెడ్ డాక్టర్ వై.కార్తీక్ చౌదరి పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T02:54:44+05:30 IST