ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: జగన్ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి?..

ABN, First Publish Date - 2023-01-18T15:53:50+05:30

ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎన్టీఆర్‌ వర్థంతి (NTR Vardhanthi) సందర్భంగా ఆ మహనీయుడికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ (CM Jagan) చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు (2 Thousand Notes) కనిపించడంలేదన్నారు. ఓట్ల కొనుగోలుకు అన్ని రూ.2 వేల నోట్లను జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌లో దాస్తున్నారని ఆరోపించారు.

పేదల రక్తాన్ని కూడా జలగలా తాగేస్తున్నారని, ఎన్టీఆర్ (NTR) సిద్దాంతాలను జయప్రదం చేయాలంటే సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

నాడు ప్రజా వేదిక కొట్టి.. నేడు ప్రజల కొంపలు కొడుతున్నారని.. 5 కోట్ల ప్రజలు సైకోపై పోరాడాల్సిన తరుణమిదని పిలుపిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పనిచేయటమే ఆయనకు నిజమైన నివాళి అని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం భువనేశ్వరి, బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-18T15:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising