కులగణనతో అన్ని వర్గాలకూ మేలు
ABN, First Publish Date - 2023-10-30T02:53:14+05:30
కులజనగణనతో కేవలం ఓబీసీలకే కాదని, సమాజంలో అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మేలు జరుగుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు.
బీజేపీతో జగన్ దోస్తీ దురదృష్టకర ం : కాంగ్రెస్
గుంటూరు, అక్టోబరు 29: కులజనగణనతో కేవలం ఓబీసీలకే కాదని, సమాజంలో అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మేలు జరుగుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. దేశంలో ఓబీసీ కుల జనగణన జాబితాను కేంద్ర ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల సీడబ్ల్యూసీలో ఓబీసీ జనగణన చేయాలని తీర్మానం చేయడంపై రఘువీరారెడ్డికి సత్కారం పేరుతో ఆదివారం గుంటూరులో ఓబీసీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కెప్టెన్ అజయ్‌సింగ్ మాట్లాడుతూ వైఎస్ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీతో ఆయన తనయుడు జగన్ దోస్తీ చేయటం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రఘువీరారెడ్డే అన్నారు.
Updated Date - 2023-10-30T02:53:14+05:30 IST