ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భూములు కొట్టేయడానికే జలగన్న భూభక్ష!

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:06 AM

రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల విలువైన పేదోళ్ల భూములను కొట్టేయడానికి జలగన్న భూభక్ష పథకం తీసుకొచ్చాడని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు.

ఈ సీఎంకు మైటోమేనియా జబ్బు: లోకేశ్‌

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల విలువైన పేదోళ్ల భూములను కొట్టేయడానికి జలగన్న భూభక్ష పథకం తీసుకొచ్చాడని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. సర్వే రాళ్లపై ‘వైఎస్సార్‌ జగనన్న భూరక్ష-2020’ అని ముద్రించడాన్ని తప్పుబట్టారు. ఆ పేరుకు బదులు జగనన్న భూభక్ష పథకం అని పేరుపెడితే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర 225వ రోజు ఆదివారం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని మునగపాక మండలం తోటాడ వద్ద నుంచి ప్రారంభమై పరవాడ మండలం మీదుగా విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలోని స్టీల్‌ప్లాంటు సెక్టార్‌-5 వరకూ సాగింది. లోకేశ్‌ మార్గమధ్యంలో కనిపించిన భూరక్ష సర్వే రాళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. పరవాడ సంతబయలు వద్ద ఆదివారం మధ్యాహ్నం సింహాచలం దేవస్థానం పంచ గ్రామాలకు చెందిన వారితో ముఖాముఖి నిర్వహించారు. గొర్లవానిపాలెం వద్ద బోనంగి, లేమర్తి, తాడి, తానాం గ్రామాల నిరుద్యోగ యువకులు ఆయన్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. పరవాడలో డ్వాక్రా మహిళలు తమగోడు వెళ్లబోసుకున్నారు.

ఆయా సందర్భాల్లో లోకేశ్‌ మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల యువత భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందన్నారు. జగన్‌ చేతకాని పాలనలో 28 శాతం నిరుద్యోగిత రేటుతో ఆంధ్రప్రదేశం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రభుత్వం కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటుచేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పరవాడ ఫార్మాసిటీ కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసి ప్రజలకు శుద్ధిచేసిన నీటిని అందిస్తామన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిస్తామని.. ఉద్యోగాలు వచ్చేంత వరకు యువగళం నిధి ద్వారా నెలకు రూ.3,000 చొప్పున భృతి ఇస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.2,500 కోట్ల అభయహస్తం డబ్బును దోచుకున్న గజదొంగ జగన్‌రెడ్డి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ రాగానే డ్వాక్రా సంఘాలకు గత వైభవం కల్పిస్తామని.. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని, హామీ ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే..

భూములు కొట్టేసే మాస్టర్‌ ప్లాన్‌

భూముల సర్వే రాళ్లపైనా జగన్‌ తమ పేర్లు ముద్రించుకోవడం దారుణం. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములు, దేవాలయాల భూములు గుర్తించి వాటిని కొట్టేయడానికే సర్వే పేరిట మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ముందు సర్వే అంటారు.. తర్వాత రాళ్లు అంటారు.. చివరగా ఈ భూమి మాదే.. కావాలంటే రాళ్లపై మా జలగన్న బొమ్మ ఉంది చూసుకోండని అంటారు. ఇటువంటి సర్వే రాళ్లు వైసీపీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి.. ఇది వాస్తవం.. రాసి పెట్టుకోండి. లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు చెబుతున్న జగన్‌కు మైటోమేనియా జబ్బు సోకింది. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీనితో బాధపడుతున్నారు. ఉత్తరాంధ్రను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది టీడీపీయే. జగన్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాష్ట్రాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్‌ యత్నిస్తున్నారు. మూడు రాజధానుల పేరిట నాటకమాడుతున్నారు. రాష్ర్టానికి పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమైన మంత్రి (గుడివాడ అమర్నాథ్‌).. కోడిగుడ్డు కథతో కాలక్షేపం చేశారు. ప్రస్తుత ధరలతో అక్కడ ఇల్లు కట్టాలంటే రూ.7 లక్షల నుంచి పది లక్షలు ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో వందేళ్లు ఉండేలా ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు వేశాం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తాం.

Updated Date - Dec 18 , 2023 | 03:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising