ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టిడ్కో లబ్ధిదారులకు నోటీసులివ్వడం దారుణం: పురందేశ్వరి

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:04 AM

జగన్‌ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ.160 కోట్లు రుణం తీసుకుని లబ్ధిదారులకు నోటీసులివ్వడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు.

పాలకొల్లు టౌన్‌, డిసెంబరు 17: జగన్‌ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ.160 కోట్లు రుణం తీసుకుని లబ్ధిదారులకు నోటీసులివ్వడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడ్కో ఇళ్లను పరిశీలించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు లక్షా ఐదు వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే ఎన్ని ఇళ్లు కట్టారో జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క నాలుగు లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారన్నారు. కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు కేంద్రం వాటా 75 శాతం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రం వాటా 25 శాతం నిధులు విడుదల చేయకే పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. ఆడుదాం ఆంరఽధ కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు.

Updated Date - Dec 18 , 2023 | 03:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising