ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పింఛన ఇచ్చి ఆదుకోండి

ABN, First Publish Date - 2023-07-04T00:02:21+05:30

పింఛన ఇచ్చి ఆదుకోండి మహాప్రభో... అంటూ మండలంలోని ముత్తేపల్లికి చెందిన కిష్టప్ప అనే దివ్యాంగుడు సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌కు విన్నవించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగళి, జూలై 3: పింఛన ఇచ్చి ఆదుకోండి మహాప్రభో... అంటూ మండలంలోని ముత్తేపల్లికి చెందిన కిష్టప్ప అనే దివ్యాంగుడు సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌కు విన్నవించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్‌ జమానుల్లాఖాన డివిజన స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ముఖ్య అతిథిగా పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌ హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించారు. మరికొన్ని ఆయా శాఖల అధికారులకు అందజేశారు. మం డలంలోని ఐదు గ్రామాల్లో ఉన్న వాల్టా చట్టాన్ని తొలగించాలని ఆయా గ్రామాల రైతులు విన్నవించారు. అలాగే మండల వ్యాప్తంగా బోర్లు, బావు లు ఉన్న రైతులకు ట్రాన్సఫార్మర్లు, విద్యుత సర్వీసులు ఇవ్వడం లేదని, దీంతో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని పలువురు రైతులు సబ్‌కలె క్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా మల్బరీ రైతులు విన్నవిస్తూ... గత ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో పట్టుగూళ్లు అమ్మిన వెంటనే కేజీకి రూ.50 వంతున ఇనసెంటివ్‌ ఇచ్చే వా రన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 30 నెలలపాటు రైతులకు ఇన్సెంటివ్‌ ఇవ్వలేదన్నారు. మార్కెట్‌లో పట్టుగూళ్ల ధర పూర్తిగా పడిపోయిందని సబ్‌కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్లారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలు భూ సమస్యలు, విద్యుత సమస్యలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను స్పందనలో విన్నవించారు. అలాగే కొన్నేళ్లుగా నిలిచిపోయిన స్త్రీశక్తి భవ నాన్ని వెలుగు కార్యాలయానికి అప్ప గించాలని ఏపీఎం సురేష్‌, సిబ్బంది విన్నవించారు. వడగుంటనహళ్లికి చెందిన రాజేశ్వరి తమ సర్వేనెంబర్‌కు చెందిన భూమిని వేరేవారి పాసు పుస్తకంలో చేర్చారని, కొన్నేళ్లుగా కార్యా లయం చుట్టూ తిరుగుతున్నా పరిష్క రించలేదని తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జమానుల్లాఖాన, పరిపాలన అధికారి శ్రీనివాసరావు, ఏఓ శేఖర్‌నాయక్‌, విద్యుత శాఖ ఏఈ శ్రీనివాస చౌదరి బాబు,ఆర్‌ఐ గుర్రన్న, తదితర డివిజన స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-04T00:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising