ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అడవులను సంరక్షించుకోవాలి : డీఎఫ్‌వో

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:19 AM

అడవులను సంరక్షించుకున్నప్పుడే మానవ మనుగడ సాధ్యమని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్‌కుమార్‌ అన్నారు.

నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 30: అడవులను సంరక్షించుకున్నప్పుడే మానవ మనుగడ సాధ్యమని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్‌కుమార్‌ అన్నారు. శనివారం నంద్యాలలోని ఎల్‌కేఆర్‌ ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ స్కూల్‌లో ప్రకృతిని ప్రేమించండి - పర్యావరణాన్ని రక్షించండి అనే అంశంతో అమేజింగ్‌ నల్లమల అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్‌కేఆర్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించగా డీఎఫ్‌వో వినీత్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ అడవులు అంతరించిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఉంటేనే సృష్టిలోకి జీవరాశుల ఉనికిని కాపాడుకోవచ్చునని సూచించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందేశాత్మకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సనత్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, ఏవో బాబీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising