ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఒక పాఠం
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:54 AM
‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయితో గడిపిన ప్రతి క్షణం ఒక విలువైన పాఠం. నేర్చుకోవడానికి అవధులు లేని అవకాశం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు.
వాజపేయికి చంద్రబాబు నివాళి
అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయితో గడిపిన ప్రతి క్షణం ఒక విలువైన పాఠం. నేర్చుకోవడానికి అవధులు లేని అవకాశం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. వాజపేయి జయంతి సందర్భంగా ఎక్స్‌లో సోమవారం ఆయన నివాళి అర్పించారు. ‘పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభిమానం చూరగొనడం ఆయనకు ఎలా సాధ్యమైందన్నది నాకు ఎప్పుడూ ఒక అద్భుతంగా కనిపిస్తుంది. రాజనీతిజ్ఞత, విశాల హృదయం, ప్రజలకు మంచి జరగాలన్న నిస్వార్థ ఆలోచనలు, దేశం పట్ల అకుంఠిత ప్రేమ... సరిహద్దులను చెరిపివేసి ఆయనను అందరికీ దగ్గర చేసింది. ఆయన జయంతి ఎన్నో మధుర స్మృతులను గుర్తుకు తెస్తోంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 02:54 AM