ఇష్టం లేకున్నా.. మనసు చంపుకొని!
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:07 AM
‘పరిస్థితులు, వచ్చినటువంటి వ్యక్తులు, సమస్యలను బట్టి ఇష్టం లేకపోయినా, మనసు చంపుకొని అయినా చేయాల్సివస్తది’’
ఎంపీ మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
బాపట్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘పరిస్థితులు, వచ్చినటువంటి వ్యక్తులు, సమస్యలను బట్టి ఇష్టం లేకపోయినా, మనసు చంపుకొని అయినా చేయాల్సివస్తది’’ అని వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘కొన్ని సందర్భాల్లో ఒడిదొడుకులు, భిన్నాభిప్రాయాలు ఎదురవుతాయి. అయినప్పటికీ తట్టుకుని నిలబడాలి. ఎందుకంటే రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా కాబట్టి భరించాలి. కాదనుకున్నప్పుడు అది వేరే విఽషయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల మీడియా ముందుకొచ్చి సీటు విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని సమర్థించినా.. రాను రాను అసంతృప్తి బయటపడుతోంది. దీనినిబట్టి మోపిదేవి భవిష్యత్‌లో సంచలన నిర్ణయాలకు సంకేతాలిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Dec 26 , 2023 | 03:07 AM