ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:25 AM
ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందికి, నక్సల్స్‌కు మ ధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఏఎ్‌సఐ గొంగటి సుధాకర్ రెడ్డి మృతి చెందారు.
ఏపీ సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ వీరమరణం
కానిస్టేబుల్‌కు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సీఎం విష్ణుదేవ్ సాయ్ అత్యవసర సమీక్ష
రాయ్‌పూర్, కోవెలకుంట్ల, డిసెంబరు 17: ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందికి, నక్సల్స్‌కు మ ధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఏఎ్‌సఐ గొంగటి సుధాకర్ రెడ్డి మృతి చెందారు. వెలగటూరు గ్రామానికి చెందిన గొంగటి వెంకట సుబ్బారెడ్డి, సుబ్బలక్ష్మమ్మల కుమారుడైన సుధాకరరెడ్డి సుమారు 29 ఏళ్లుగా సీఆర్‌పీఎ్‌ఫలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ రాము గాయపడగా ఆయననుఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని సోమవారం వెలగటూరుకు తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. అదే రోజు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది. కాగా, ఉదయం జాగర్‌గుండ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సీఆర్‌పీఎఫ్ 165వ బెటాలియన్ కూంబింగ్‌లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనతో బస్తర్ డివిజన్‌లో వేర్వేరు నక్సల్స్ ఎదురు కాల్పు ల్లో ఇప్పటి వరకు ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. మొత్తం ఏడుగురు గాయపడ్డారు. తాజా ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అధ్యక్షతన ఆదివారం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షసమావేశం జరిగింది. రాష్ట్రంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌ను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. అమరుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Updated Date - Dec 18 , 2023 | 02:25 AM