సీఎం బంధువులకే విద్యుత్ మీటర్ల కాంట్రాక్ట్: ఏఐకేఎస్
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:12 AM
రాష్ట్రంలో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే కాంట్రాక్ట్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన దగ్గరి బంధువులకే అప్పగించారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అన్నారు.
కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 16: రాష్ట్రంలో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే కాంట్రాక్ట్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన దగ్గరి బంధువులకే అప్పగించారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అన్నారు. ఏఐకేఎస్ జాతీయ సమావేశాల సందర్భంగా శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ బిల్లు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తుంటే, ఏపీలో 18,75,000 మంది రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే కాంట్రాక్ట్‌ను సీఎం జగన్ తన బంధువులకే కట్టబెట్టడం దారుణమన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 05:12 AM