యువగళం-నవశకం సభ నాభూతో నా భవిష్యత్’
ABN, Publish Date - Dec 24 , 2023 | 01:38 AM
యువగళం-నవశకం సభ నాభూతో నా భవిష్యత్’
రాజోలు, డిసెంబరు 23: యువగళం-నవశకం బహిరంగ సభ నాభూతో నా భవిష్యత్ అని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. తాటిపాకలో శని వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువగళం నవశకం చారి త్రాత్మక ఘట్టమన్నారు. ఒకే వేదికపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, లోకేశ్‌లను చూసిన అభిమానులకు కన్నుల పండుగని అన్నారు. టీడీపీ- జనసేన పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమన్నారు. సీఎం జగన్ వంటి దుర్మార్గపు భావజాలం కలిగిన వ్యక్తిని శాశ్వతంగా ఇంటికి సాగనంపాలంటే కలయిక అవసరమన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం శాశ్వతంగా కనుమరుగవ్వడం ఖాయమన్నారు. ఎంపీపీ కేతా శ్రీను, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, మంగెన భూదేవి, బందెల పద్మ, వైస్‌ఎంపీపీ పొలమూరి శ్యామ్‌బాబు, రాపాక ఆనంద్‌కుమార్, గుద్దటి చిట్టబ్బాయి, వలవల శేఖర్, పితాని సూరిబాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 01:38 AM