ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ.. అబద్ధాల ప్రభుత్వం

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:34 AM

వైసీపి ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శనివారం నిడదవోలులోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 15ు మాత్రమే అమలు చేసి మిగిలిన 85ు గాలికి వదిలేశాడన్నారు.

నిడదవోలులో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న బూరుగుపల్లి శేషారావు

  • హామీలు 85శాతం గాలికొదిలేసిన జగన్‌

  • పలు సంఘాలు చేస్తున్న దీక్షలే నిదర్శనం

  • మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు

నిడదవోలు, డిసెంబరు 30: వైసీపి ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శనివారం నిడదవోలులోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 15ు మాత్రమే అమలు చేసి మిగిలిన 85ు గాలికి వదిలేశాడన్నారు. జగన్‌ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాడు అనేది బహిరంగ నిజమ న్నారు. అమలుకాని హామీలపై అబద్ధాలు వల్లివేద్దామంటే జగన్‌ మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. నేడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా హామీలను అమలు చేయాలని పలువురు చేస్తున్న నిరవధిక దీక్షలే ఇందుకు నిదర్శనమ న్నారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, కారింకి నాగేశ్వరరావు, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, సతీష్‌, బం డి గోపాలకృష్ణ, షాజహాన్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలులోని 17వ వార్డు సుబ్బరాజుపే టలో టీడీపీ, జన సేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యకమ్రంలో ప్రజావేదిక నిర్వహించారు. బూరుగుపల్లి శేషారావు, బైపే రాజేశ్వరరావు, చదలవాడ శ్రీనివాసరావు, కారింకి సాయిబాబా పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising