ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బస్‌ యాత్రకు రాకపోతే పథకాలు కట్‌?

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:13 AM

బస్‌యాత్రకు రాకపోతే పథకాలు కట్‌ అంటూ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండల కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

20 వేల మందిని తరలించే యోచన

ప్రభుత్వ తీరుపై నాయకుల అసహనం

నేడు వైసీపీ సామాజిక సాధికార బస్‌ యాత్ర

గోపాలపురం, డిసెంబరు 16 : బస్‌యాత్రకు రాకపోతే పథకాలు కట్‌ అంటూ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండల కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నారు.ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండ లాల నుంచి బస్సు యాత్రను జనం తరలించే పనిలో పడ్డారు. యా త్రకు హాజరుకాకపోతే రుణమాఫీకి సంబంధించి ఆన్‌లైన్‌ చేయ మని..పథకాలు నిలిపివేస్తామంటూ డ్వాక్రా మహిళలకు సీఏల ద్వారా బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. బస్సు యాత్ర బహిరంగ సభను 20 వేల మందితో విజయ వంతం చేయాలనే యోచనలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు.దీనిలో భాగంగా ఒక్కో మండలం నుంచి వెయ్యి మోటర్‌ సైకిళ్ళు చొప్పున నాలుగు మండలాల నుంచి 4 వేల మోటార్‌ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. మండలంలో 1606 మహిళా సంఘాలు ఉండగా 53 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రామ సంఘానికి 2 బస్సులు చొప్పున గోపాలపురం మండలంలో 53 గ్రామ సంఘాలకు 106 స్కూలు బస్సులు సిద్ధం చేస్తున్నట్లు సమాచా రం. మండలంలో 16,060 మంది డ్వాక్రా మహిళలు ఉండగా అత్యధిక శాతం బస్సు యాత్రకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆ శాఖలో క్షేత్రస్థాయిలో పని చేసే సీఏలు మహిళలకు ఫోన్లు చేసి ఒంటి గంటకు ప్రతి ఒక్కరు బస్సు వద్దకు రావాలని సమావేశానికి గైర్హాజరైతే వారి పథకాలు కట్‌ చేస్తామని లోపాయికారికంగా సమాచా రం ఇస్తున్నారు.దీంతో బస్సు యాత్రకు వెళ్లకపోతే పథకాలు నిలిపివే స్తారనే ఆందోళనలో మహిళలు ఉన్నారు. యర్నగూడెంలో 2 గంటలకు మం త్రులు విలేకరులతో మాట్లాడతారు.. కృష్ణం పాలెం, రామన్నపాలెం మీదుగా దేవరపల్లి భారీ బైక్‌ర్యాలీ నిర్వహిస్తారని అన్నారు. దేవరపల్లి 3 రోడ్ల సెంటర్‌లో సాయంత్రం 4.30కు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. బస్సు యాత్రలో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొంటారు.

Updated Date - Dec 17 , 2023 | 12:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising