ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేంద్ర పథకాలపై ప్రచారానికే యాత్ర

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:55 AM

జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో ప్రచార రథం ద్వారా కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్టు వికసిత్‌ భారత్‌ నోడల్‌ అధికారి, కేంద్ర ఉన్నత విద్యా డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక్‌ చతుర్వేది తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ ముగ్గును పరిశీలిస్తున్న చతుర్వేది, జిల్లా అధికారులు

కొవ్వూరు, డిసెంబరు 28 : జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో ప్రచార రథం ద్వారా కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్టు వికసిత్‌ భారత్‌ నోడల్‌ అధికారి, కేంద్ర ఉన్నత విద్యా డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక్‌ చతుర్వేది తెలిపారు. కొవ్వూరు మండలం ఐ. పంగిడి గ్రామంలో గురువారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. యాత్రలో బాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా ఎంతమందికి ప్రయోజనం కలిగింది.. ఇంకా ఎంత మంది అర్హులు ఉన్నారో తెలుసుకోవడమే జిల్లా, మండలం, గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన ఉత్సవ్‌, సాంస్కృతిక కమిటీల ముఖ్యోద్దేశమన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల చిట్ట చివరి లబ్ధిదారుడికి కేంద్రం అమలు చేస్తున్న పఽథకాల లబ్ధి చేరేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు.ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ సాగులో పండించిన పంటల ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను, కూరగాయలతో వేసిన ముగ్గులు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార స్టాల్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి కె.మాధవరావు, డ్వామా పీడీ పి.జగదాంబ, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీ.ఎస్‌.మూర్తి, డీఎల్‌డీవో వి. శాంతామణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising