ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దొండకాయలు కేజీ రూ.3

ABN, First Publish Date - 2023-11-06T00:00:17+05:30

దొండకాయల రేటు దిగజారిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌లో కేజీ రూ. 20 రూపాయలు విక్రయిస్తున్న దొండకాయలు రైతుల వద్ద కేవలం రూ. 3లకే దళారులు కొనుగోలు చేస్తున్నారు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

దొండకాయలు

50 కేజీల బస్తా రూ.150 మాత్రమే

పెరవలి, నవంబరు 5 : దొండకాయల రేటు దిగజారిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌లో కేజీ రూ. 20 రూపాయలు విక్రయిస్తున్న దొండకాయలు రైతుల వద్ద కేవలం రూ. 3లకే దళారులు కొనుగోలు చేస్తున్నారు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను వదల్లేక.. వచ్చేది సరిపోక సత మతమవుతున్నారు. జిల్లాలో పెరవలి మండలం ఖండవల్లి, అన్న వరప్పాడు, ఉండ్రాజవరం, కొవ్వూరు, నిడదవోలు, సీతానగరం, కడి యం, అనపర్తి తదితర మండలాల్లో దొండసాగు ఉంది. ఒకసారి పందిరి వేసి దొండపాదు ఎక్కిస్తే నాలుగేళ్ల పాటు పంట చేతికొస్తుంది. పెట్టుబడి ఒకేసారి పెడితే రెండేళ్ల వరకూ చూసుకోవాల్సిన పని లేకపోవడంతో రైతాంగం దొండసాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడి పెరిగింది.. అయితే ధర దిగజారి గిట్టుబాటు కాక లబోదిబోమంటు న్నారు.ఒక బస్తా దొండకాయలు 50 నుంచి 60 కేజీల వరకు తూకం వస్తుంది. ప్రస్తుత ధర ప్రకారం ఒక బస్తాకు రూ.150 నుంచి రూ.180 వరకు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో ఆ దొండకాయలు అమ్మిన సొమ్ము కోత కూలీలకు కూడా సరిపోవడం లేదని వాపోయారు.గతంలో పది కేజీలు, రూ.250 నుంచి రూ.300 వరకు ధర పలికేది. ప్రస్తుతం ధర దారుణంగా పడిపో వడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేటు లేదని పంట మారుద్దామంటే కుదురేపనికాదని మళ్లీ రేటు ఎప్పు డు పెరుగుతుందో చెప్పలేమని.. ప్రస్తుతం నష్టాలు వచ్చినా పాదులు కాపాడుకోవాలన్నారు.

రెండు బస్తాలు అమ్మినా.. మిగిలేది సున్నా..

పందిరి వే యడానికి ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఎరువులు, పురుగు మందులకు ఏడాదికి 50 వేల వరకు ఖర్చు చేస్తారు. ఇవి కాక కోతకు రూ.250 చొప్పున చెల్లించాలి. ఒక మనిషి బస్తాన్నర నుంచి రెండు బస్తా లు వరకు కోత కోస్తారు. ఈ లెక్కన రెండు బస్తాలు విక్రయిస్తే కూలీ మాత్రమే వస్తుంది.. రైతుకు మిగిలేదేం లేదు.

కూలీ రావడం లేదు..

దొండ 20 సెంట్లలో సాగు చేస్తున్నా. దొండకాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తే కోత ఖర్చులు కూడా రావడంలేదు.వీటికి రవాణా చార్జీలు అదనం. ప్రతి కోతకు ఐదారు బస్తాలు అవుతాయి. ముగ్గురు కూలీలను పెట్టవలసి ఉంటుంది. అంటే ముగ్గురికి ఆడవారు అయితే రూ.750 ఇవ్వాలి. ఐదు బస్తాలు తీసు కుంటే రూ.850 వస్తుంది. కాయలు అమ్మిన సొమ్ము కూలీలకు సరిపోవడం లేదు. రవాణా ఖర్చులు జేబులోవి పడుతున్నాయి.

- కుడిపూడి జగన్‌, దొండ రైతు, ఖండవల్లి

Updated Date - 2023-11-06T00:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising