ద్వారంపూడి గతమంతా అవినీతే..
ABN, First Publish Date - 2023-12-06T00:27:22+05:30
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన కుటుంబం మూడు తరాలు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆయన మూడు తరాలది అక్రమాల వ్యాపారమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు.
కాకినాడ సిటీ, డిసెంబర్ 5 : కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన కుటుంబం మూడు తరాలు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆయన మూడు తరాలది అక్రమాల వ్యాపారమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ ఆయన దోపిడీలు అన్యాయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నుంచి కాకినాడ ప్రజలను రక్షించడమే ధ్యేయంగా నగరంలో టీడీపీ శ్రేణులు పని చేస్తున్నాయన్నారు. ద్వారంపూడి మొదటి, రెండు, మూడో తరం నల్లమందు, గంజాయి, దొంగ నోట్ల మార్పిడి, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలు చేసింది తప్ప ఏనాడు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఇతరుల కుటుంబాలను విమర్శించే ముందు ద్వారంపూడి చీకటి వ్యాపారాల చరిత్ర ప్రజలందరికీ తెలుసన్న విషయం గ్రహించుకోవాలన్నారు. తమ పార్టీ యువనేత లోకేష్ చేప ట్టిన యువ గళం పాదయాత్రకు అశేష ప్రజా స్పందన రావడంతో ద్వారంపూడి అవాకులు చవాకులు పేలు తున్నారన్నారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ ఎమ్మెల్యే దోపిడీ చంద్రశేఖరరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అన్ని వాస్తవమేనన్నారు. అక్రమ వ్యాపారాలు, అవినీతి కార్యకలాపాలతో సంపాదించిన ధన అహంకారంతో కొవ్వు పట్టి ద్వారంపూడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు.
ద్వారంపూడి కోసం రెడ్ బుక్ సిద్ధం..
గతంలో ఎన్నో అక్రమాలు చేసిన ద్వారంపూడి తమ టీడీపీలో ఉన్న కోవర్డుల సహాయం వల్ల అప్పట్లో తప్పించుకున్నారని, ఈసారి అతనిని వదిలేది లేదంటూ ద్వారంపూడి కోసం రెడ్ బుక్ సిద్ధంగా ఉందని కొండబాబు హెచ్చరించారు. లోకేష్ నాలుక చీరేస్తానన్న ద్వారంపూడిని 2024 ఎన్నికల్లో కాకినాడ ప్రజలు చీరేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎంఏ తాజుద్దీన్, తుమ్మల రమేష్, పలివెల రవి, వొమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, చింతలపూడి రవి, అంబటి చిన్న, గుజ్జు బాబు, నరవ చంద్రశేఖర్, గెడ్డం పూర్ణ, పాలిక నాని పాల్గొన్నారు.
Updated Date - 2023-12-06T00:27:23+05:30 IST