చంద్రబాబుతోనే సుపరిపాలన : యనమల దివ్య
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:09 AM
తుని రూరల్, డిసెంబరు 22: ప్రజా నాయకుడు చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. తుని 14వ వార్డులో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో భాగంగా దివ్య పట్టణవాసులకు కర
తుని రూరల్, డిసెంబరు 22: ప్రజా నాయకుడు చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. తుని 14వ వార్డులో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో భాగంగా దివ్య పట్టణవాసులకు కరపత్రాలు పంచి మాట్లాడుతూ అవినీతి, అక్రమాలతో చెలరేగిపోతున్న వైసీపీ పాలకులను గద్దె దింపి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టాలని కోరారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల రేట్లు చుక్కలను తాకుతున్నాయని పేద,మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లా టీడీపీ యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, టీడీపీ నేతలు పోల్నాటి శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు అల్లు రాజు, మల్ల గణేష్, జల్లు వాసు, తుని పట్టణాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:09 AM