నేటి నుంచి షష్ఠి ఉత్సవాలు ప్రారంభం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:54 AM
తెలుగు రాష్ట్రాల్లో పేరొంది సోమవారం నిర్వహించే బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరుని షష్ఠి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి తెలిపారు.
స్వామి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
నేడు బిక్కవోలులో కుమారసుబ్రహ్మణ్యేశ్వరుడి షష్ఠి
బిక్కవోలు, డిసెంబరు 17: తెలుగు రాష్ట్రాల్లో పేరొంది సోమవారం నిర్వహించే బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరుని షష్ఠి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున 1-20 గంటలకు స్వామివారి తీర్ధపుబిందె సేవతో ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. అప్పటి నుంచి భక్తులకు స్వామి దర్శనాలు కల్పించనున్నట్టు తెలిపారు. భక్తుల దర్శనాలకు భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ఆవరణ అంతా చలువ పందిరి వేసి విద్యుత్ దీపాలతో అలంకరించామని చెప్పారు. సోమవారం మయూర వాహనంపై గరగ నృత్యాలు, తీన్‌మార్, అఘోరా నృత్యాలు, బ్యాండు కచేరీల స్వామివారి గ్రామోత్సవం, వివిధ బ్యాండు కచేరీలు, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారే వరకూ స్థానిక ఉన్నత పాఠశాలలో బాణసంచా కాల్పులు ఉంటాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం రథోత్సవం, ఈనెల 24న మహాన్నదానంతో షష్ఠి ఉత్సవాలను ముగిస్తాయన్నారు. 19 నుంచి డిసెంబరు 22 వరకూ షష్ఠి కళావేదికపై వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
250 మంది పోలీసులతో బందోబస్తు
షష్ఠి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాజమహేంద్రరం తూర్పు డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సీఐ శివగణేష్, ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. వీరిలో డీఎస్పీతో పాటు ఐదుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 70 మంది వుమెన్ పోలీసులు, యాభై మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, యాభై మంది కానిస్టేబుళ్లు, యాభై మంది హోమ్‌గార్డులు విధులు నిర్వహిస్తారన్నారు. షష్ఠి సందర్భంగా ట్రాఫిక్ దృష్ట్యా బిక్కవోలు నుంచి గొల్లల మామిడాడ వెళ్లే రూటులో ఫోర్ వీలర్లకు ఈనెల 18 నుంచి 20 వరకూ అనుమతులు నిలిపి వేశామని, వాహన యజమానులు సహకరించాలని కోరారు.
షష్ఠికి ఆలయాలు ముస్తాబు
తాటిపర్తి, మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల్లో షష్ఠి మహోత్సవాలు
గొల్లప్రోలురూరల్, డిసెంబరు17: దేశవ్యాప్తంగా స్వయంభూ వెలసిన స్వామిగా ప్రసిద్ధిగాంచిన గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, మల్లవరం గ్రా మాల్లోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు షష్ఠికి ముస్తాబవుతున్నాయి. షష్ఠి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 18నుంచి 23వ తేదీ వరకూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉభయ గోదావరి జిల్లాలు నుంచే గా క తెలుగురాష్ట్రాల నలుమూలలు నుంచి భక్తులు అధికంగా తరలివస్తారు.
తాటిపర్తి క్షేత్రప్రాశస్త్యం
గొల్లప్రోలు మండలంలో తాటిపర్తి గ్రామంలో వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్వయంభూగా వెలి శారు. ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహంవద్ద పాము కొంతకాలంపాటు ఉండి అక్కడే పాము చనిపోవడంతో ఆ స్థానం లో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి సమీపంలోనే అపర్ణాసమేత నాగేశ్వరస్వామి ఆలయం ఉండటంతో మరింత ప్రా శస్త్యం లభించింది. సంతానప్రాప్తికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సన్నిధిలో ఎరుపురంగు చారల చీర కట్టుకుని రాత్రంతా నిద్రిస్తే మంచిదని భక్తుల నమ్మిక.
నేటి నుంచి బ్రహోత్సవాలు
వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి 86వ షష్టి బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ప్రారంమవుతాయి. 23వతేదీ వరకూ జరుగుతాయి. 18న తెల్లవారుజామున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ఉదయం 7గంటలు నుంచి సర్వదర్శనం, రాత్రి శూలాల సంబరం, చెట్టుభజన, తాడిపెద్దు సంభరం జరుగుతాయి. 22న సుబ్రహ్మణ్య షట్‌సహస్ర నామార్చన, సాయంత్రం మయూర వాహనంపై స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం, అఘోరాల నృత్యప్రదరన, తప్పిటగుళ్ల కోలాటాములు, 23న సాయంత్రం అపర్ణాపుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం, రాత్రి శ్రీపుష్పయాగం జరుగుతాయి. 19 నుంచి 21 వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ప్రత్యక్షంగా వెలసిన కేత్రం ఆలవెల్లి మల్లవరం
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చిన క్షేత్రమిది. సర్పరూపంలో భక్తులకు దర్శనమివ్వగా అక్కడే ఆల యాన్ని నిర్మించారు. 1961-64 మధ్య ఆలవెల్లి మల్లవరంలో ని పంటపొలాల్లో సర్పం రైతులకు కనిపించింది. కదలకుం డా అక్కడే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తమకు ప్రత్యక్షంగా కనిపించాడని భావించిన ప్రజలు పూజలు నిర్వహించడంతో అక్కడే ఆలయం నిర్మించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రత్యక్షంగా వెలశాడనే సమాచారం తెలియడంతో దేశంలోని వివిధ ప్రాంతాలు నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చేవారు. వారి కోసం అప్పట్లో మల్లవరం రైల్వేగేటువద్ద ప్రత్యేకంగా హాల్టు ఇవ్వడంతోపాటు స్టేషన్ నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు. సంతాన ప్రాప్తికి, కుజదోషనివారణకు ఆలయ ఆవరణలో నిద్రిస్తే మంచిదని భక్తుల నమ్మిక.
సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
అమలాపురం రూరల్, డిసెంబరు 17: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో ప్రసిద్ధినొందిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వా మి ఆలయంలో ఆదివారం కల్యాణ, తీర్థ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి-అమ్మవార్లను సర్ప వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. అనంత రం గూడ వంశీకుల ఆధ్వర్యంలో రాత్రి వందలాది మంది భక్తులు తిలకిస్తుండగా సుబ్రహ్మణ్యేశ్వరుని కల్యాణం వైభవంగా జరిగింది.
Updated Date - Dec 18 , 2023 | 12:54 AM