ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెయ్యేళ్ల చరిత్రగల రాజమహేంద్రవరం దేశానికే తలమానికం

ABN, First Publish Date - 2023-12-11T01:03:49+05:30

వెయ్యేళ్ల చారిత్రక నేపథ్యంలో గల రాజమహేంద్రవరం భారతదేశానికే తలమానికం అని కేంద్ర పౌరవిమానయాన ఉక్కు శాఖా మంత్రి జ్యోతిరాధిత్య ఎంసింధియా పేర్కొన్నారు.

మధురపూడి విమానాశ్రయ విస్తరణకు శంకుస్థాపన

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా

కోరుకొండ, డిసెంబరు 10: వెయ్యేళ్ల చారిత్రక నేపథ్యంలో గల రాజమహేంద్రవరం భారతదేశానికే తలమానికం అని కేంద్ర పౌరవిమానయాన ఉక్కు శాఖా మంత్రి జ్యోతిరాధిత్య ఎంసింధియా పేర్కొన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంవద్ద రూ.347కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్‌ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రఽధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశంలో విమానాయానం రెట్టింపు అయిందన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడంలో చేస్తున్న ప్రయత్నంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి, విమానయాన రంగాన్ని అభివృద్ధి వేగవంతంగా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014నాటికి దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండగా ఈ తొమ్మిదిన్నరేళ్లలో కొత్తగా మరో 75 ఎయిర్‌పోర్టులు వచ్చాయన్నారు. దీంతో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 149కి చేరిందన్నారు. రానున్న కాలంలో వీటి సంఖ్యలో 220కి పెంచనున్నట్లు తెలిపారు. నగరానికి నగరానికి, రాష్ట్రానికి రాష్ట్రానికి వేగంగా ప్రయాణం చేయడానికి అనువుగా విమానయాన సంస్థ వేగంగా ప్రణాళికలుచేసి అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ పాయింట్‌ 21వేల 94 చదరపు అడుగుల వైశ్యాలం కలిగి ఉంటుందని రద్దీ వేళల్లో రోజుకు 2100 మంది ప్రయాణికులకు సేవలు అందించడంతోపాటుభవిష్యత్‌లో ప్రతిఏటా 30లక్షల మంది ప్రయాణికులతో వార్షిక సామర్ధ్యం ఉంటుందని ఆయన తెలిపారు. 28 చెక్‌ ఇన్‌ కౌంటర్లు, 4అరైవల్‌ కంక్ల్యూజర్‌, 600 కార్లకు సరిపడా కారు పార్కింగ్‌, 5స్టార్‌ రేటింగ్‌తో ఈ కొత్త టెర్నినల్‌ భవనం రూపుదిద్దుకుంటుందని కేంద్రమంత్రి సింధియా వివరించారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ భవనం విస్తరించనున్న దృష్ట్యా ప్రస్తుతం 18 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు రానున్న రోజుల్లో 25 వరకు సర్వీసులు పెంచనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం 250 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రతినిత్యం ప్రయాణిస్తున్నారని రానున్న రోజుల్లో 1400 మంది రోజూ ప్రయాణాలు సాగించేలా ఎయిర్‌పోర్టు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ దేశంలో మౌలిక రంగాల అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు దేశ సాంస్కృతి రాజధాని రాజమండ్రి విమానాశ్రయం కూడా అభివృద్ధి చేస్తామ న్నారు. విమానాశ్రయాన్ని భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. పెద్ద విమాన సర్వీసులకు అనుకూలంగా అత్యాధునికి సాంకేతిక, ఫర్నీచర్‌ అందుబాటులోకి రానున్నదని ఆ మేరకు కీలక పనులకు ఈ రోజు అంకురార్పణ చేశామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పటికే ప్రారంభించామన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా ప్రారంభించుకోనున్నామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, తిరుపతి ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేశామన్నారు. ఎందరో చరిత్రకారులు, సంఘ సంస్కర్తలు పుట్టిన ఈ పుణ్యభూమి రాజమహేంద్రవరం అన్నారు. ఆదికవి నన్న య్య, న్యాయపతి సుబ్బారావు, అల్లూరి సీతారామరాజువంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ వారే అన్నారు.

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, ఐటీ శాఖా మంత్రిగుడివాడ అమర్‌నాధ్‌ మాట్లాడుతూ దేశంలో అనేక ప్రాంతాలతో సంబంధాలు ఉన్న ప్రాంతం రాజమహేంద్రవరం అన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆకాంక్ష మేరకు ప్రధాని రేంద్రమోదీ, విమా నయాన, ఉక్కు శాఖా మంత్రిజ్యోతిరాధిత్య సింథియా విమానయాన సర్వీసులు మరింత విస్తరిస్తున్నారన్నారు. ఈ విమానాశ్రయం పనులు మరో 24నెలల్లో పూర్తవుతుందన్నారు. పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ ఈ నూతన టెర్నికల్‌ భవనం ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాజమహేంద్రవరం అభివృద్ధికి, ఉభయగోదావరిజిల్లాల అభివృద్ధికి దృఢ సంకల్పంతో పని చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ 1224 ఎకరాల్లో సుమారు 70లక్షల జనాభాకు ఉపయోగపడే విధంగా ఈ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తూ నూతన టెర్మినల్‌ భవన నిర్మాణానికి నిధులు ఇచ్చిన కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సింధియాను కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.347.15 కోట్లు వెచ్చించి రాజమహేంద్రవరం చరిత్రలో నూతన అధ్యయనమని పేర్కొన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలన్న మన ఆకాంక్షకు అనుగుణంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచంలో 5వ స్ధానం నుంచి 3వఆర్ధిక శక్తిగా భారత్‌ నిలబడానికి చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలపై ప్రఽధాని దృష్టి సారించారన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని రూ.347కోట్లతో అభివృద్ధి చేయడంతో ఒక నూతన అధ్యాయానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎయిర్‌పోర్టు అధారిటీ చైర్మన్‌ ఆఫ్‌ ఇండియా సంజయ్‌కుమార్‌పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాధవీలత, జాయిం ట్‌ కలెక్టర్‌ ఎం.తేజ్‌భరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఎయిర్‌పోర్టు అథా రిటీ చైర్మన్‌ ఆఫ్‌ ఇండియా సంజీవ్‌కుమార్‌, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్‌.జ్ఞానేశ్వరరావు, పలువురు విమానయాన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising