టీడీపీ, జనసేన ప్రభుత్వంలోనే అభివృద్ధి
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:35 AM
టీడీపీ, జనసేన ప్రభుత్వంలోనే అభివృద్ధి
అంతర్వేది, డిసెంబరు 21: అంతర్వేది, అప్పనరా మునిలంక గ్రామాల్లో మండల అధ్యక్షుడు గుబ్బల ఫణికుమార్ ఆధ్వర్యంలో గురువారం టీడీపీ- జన సేన సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిం చారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వ యకర్త గుండుబోగుల పెదకాపు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడారు. అభివృద్ధిలేని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలని, కార్యకర్తలంతా పార్టీలకు పట్టుకొమ్మల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాపాక రమేష్‌బాబు, ఎంపీటీసీ చొప్పల బాబూరావు, మితిన్, టీడీపీ, జనసేన పార్టీల నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 12:35 AM