కొండబాబు కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:13 AM
ఈనెల 7న కాశీలో మండపేటకు చెందిన మెకానిక్ గుండవరపు కొండబాబు కుటుంబ సభ్యులు నలుగురు సామూహికంగా ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీ సులు దర్యాప్తును వేగవంతం చేశారు. వారాణసి నుంచి వచ్చిన పోలీసులు రెండోరోజు శనివారం కొండబాబు సత్యశ్రీరోడ్డులో అద్దెకు ఉండే ఇంటిని దససోమేదా స్టేషన్ ఎస్‌ఐ బిపిన్ పాండే, స్థానిక పోలీసులు, వీఆర్వో, ఇంటి యాజమాని సమక్షంలో తాళాలు బద్దలుకొట్టారు.
మండపేట, డిసెంబరు 16: ఈనెల 7న కాశీలో మండపేటకు చెందిన మెకానిక్ గుండవరపు కొండబాబు కుటుంబ సభ్యులు నలుగురు సామూహికంగా ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీ సులు దర్యాప్తును వేగవంతం చేశారు. వారాణసి నుంచి వచ్చిన పోలీసులు రెండోరోజు శనివారం కొండబాబు సత్యశ్రీరోడ్డులో అద్దెకు ఉండే ఇంటిని దససోమేదా స్టేషన్ ఎస్‌ఐ బిపిన్ పాండే, స్థానిక పోలీసులు, వీఆర్వో, ఇంటి యాజమాని సమక్షంలో తాళాలు బద్దలుకొట్టారు. ఇంటిలో కొన్ని కాగితాలను పరిశీలించారు. అలాగే కొండబాబు పేరిట ఉన్న మండపేట స్టేట్‌బ్యాంకు ఖాతాపై కూడా ఆరా తీశారు. కొండబాబు కుమారుడు రాజేష్ సంతకంతో ఉన్న కాగితాలను కూడా యూపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజేష్ పనిచేసిన ద్విచక్ర వాహన షాపు యాజమాని ప్రసాద్, మరో మహిళ వీరలక్ష్మి, తాపేశ్వరానికి చెంది మల్లిబాబు ఇళ్ల వద్దకు వెళ్లగా వారంతా ఇంటికి, దుకాణాలకు తాళాలు వేసి పరారీలో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేస్తామని యూపీ పోలీసులు తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 12:13 AM