ఆగిపోయిన వందే భారత్ రైలు
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:49 AM
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు అడుగడుగునా ప్రయాణికులను ఇబ్బంది పెడుతోం ది. సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో సాంకేతిక లోపంతో కొవ్వూరు-పశివేదల మధ్యన శుక్రవారం రాత్రి 8.55 గంటలకు నిలిచిపో యింది.
కొవ్వూరు పశివేదల మధ్యన 8.55 గంటలకు నిలిచిన రైలు
రాత్రి 11.40కు సాధారణ ఇంజన్లతో రాజమహేంద్రవరం తరలింపు
ఇక్కడ నుంచి గంటకు 20 కిలోమీటర్లు.. ప్రయాణికులకు ఇక్కట్లు
రాజమహేంద్రవరం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి)/కొవ్వూరు: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు అడుగడుగునా ప్రయాణికులను ఇబ్బంది పెడుతోం ది. సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో సాంకేతిక లోపంతో కొవ్వూరు-పశివేదల మధ్యన శుక్రవారం రాత్రి 8.55 గంటలకు నిలిచిపో యింది. వెంటనే సిబ్బంది హాజరైనా ఫలితం లేకపోవడంతో రాజమహేంద్రవరం నుంచి సాధారణ రైళ్లకు ఉపయోగించే రెండు ఎలక్ర్టికల్ ఇంజన్లను కొవ్వూరు పంపిం చారు. ఆ ఇంజన్లను వందే భారత్ రైలుకు అమర్చి రాజమహేంద్ర వరానికి గంటకు 130 కి.మీ నుంచి 180 కి.మీ స్పీడ్‌తో వెళ్లే రైలును 20 కి.మీ స్పీడ్‌తో రాజమహేంద్ర వరం తీసుకొచ్చారు. దీంతో రాత్రి 8.55 గంటలకు రాజమండ్రి చేరుకోవాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 11.40 నిమిషాలకు చేరుకుంది. అయితే ఇక్కడ కూడా సాంకేతిక సిబ్బంది హాజరైనప్పటికీ ఉపయోగం లేకపోవడంతో అదే ఇంజన్లతో 12 గంటలకు వందే భారత్ బయలుదేరింది. రైలును నెమ్మదిగానే విశాఖపట్నం చేరుస్తామని అధి కారులు చెప్పినట్టు ప్రయాణికులు వెల్లడించారు. అయితే వందేభారత్ రైలు నెమ్మదిగా వెళ్లడంతో వెనుక వచ్చే రైళ్లన్నీ కూడా ఆలస్యంగా నడిచాయి.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వాస్తవానికి 11.40 నిమిషాలకు విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి వేరే రైళ్ల ద్వారా భువనేశ్వర్, కలకత్తా వైపు వెళ్లే ప్రయాణికులు వందే భార త్‌లో ఉన్నారు. ఆ రైళ్లు వందే భారత్ వెళ్లే లోపులో వెళ్లిపోతాయని వాటిలో తమకు రిజర్వేషన్ ఉందని ఈ అసౌకర్యానికి రైల్వే ఏం సమాధానం చెబుతుందని ప్రయా ణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే భారత్ ఒక వేళ రాజమండ్రి నిలిపివే యాల్సి వస్తే ప్రయాణికులను వేరే రైళ్లలో తరలించాలనే ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు 12 మంది టిక్కెట్ చెకింగ్ సిబ్బంది చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో వందేభారత్ వద్దకు చేరుకున్నారు. కానీ వందే భారత్ బయలుదేరడంతో వారు ఊపి రిపీల్చుకున్నారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమై రైళ్ల వద్దకు చేరుకున్నారు.
హీరా కుండ్ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్లాలి : శ్రీనివాస్, సీఏ, సికింద్రాబాద్
వందేభారత్‌లో టిక్కెట్ ధర అధికంగా ఉన్నప్పటికీ సమయానికి చేరుతుందన్న నమ్మకంతో ప్రయాణిస్తున్నాం. కానీ ఈ రైలు మామూలు రైళ్ల కంటే దారుణంగా తయారైంది. నాకు విశాఖపట్నం నుంచి 12.15 గంటలకు బయలుదేరే హీరాకుండ్ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు రాజమహేంద్రవరం చేరుకునేసరికే 12 గంట లైంది. విశాఖ వరకు నెమ్మదిగానే వెళుతుందని చెప్పారు. నా ఇబ్బందికి బాధ్యులెవరు.
రైలులో స్పార్క్ వచ్చింది : హనీష్‌రాజు, వరంగల్
వందేభారత్ రాజమండ్రి చేరుకున్న వెంటనే సీ12 బోగిలోని 33వ బెర్త్‌లో ఉన్న వరంగల్‌కు చెందిన హనీష్‌రాజు బయటకు దిగిపోయాడు. అతనిని పోలీసులు ప్రశ్నించగా ఆ బోగీలో స్పార్క్ వచ్చిందని.. ఈ రైలులో క్షేమంగా వెళతామని నమ్మకం లేదని పోలీసులతో చెప్పాడు. ఏ ఇబ్బంది లేదని చెప్పడంతో రైలెక్కి వెళ్లాడు.
Updated Date - Dec 23 , 2023 | 01:49 AM