ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:35 AM
తిమ్మాపురం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎంఎస్‌ఎన్ పీజీ క్యాంపస్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 27న స్పాట్ అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రశాంతశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు.
సర్పవరం జంక్షన్, డిసెంబరు 25: తిమ్మాపురం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎంఎస్‌ఎన్ పీజీ క్యాంపస్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 27న స్పాట్ అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రశాంతశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ఐసెట్ రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీజీ క్యాంపస్‌లో అధునాతన సదుపాయాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ప్లేస్‌మెంట్ సెల్, ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 27న రాజమహేంద్రవరం అక్నూలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాల కోసం ఎంబీఏ కోర్సు కోసం 9502228676, ఎంసీఏ కోసం 7898363337, అడ్మిషన్స్ సెక్షన్ కోసం 9701827564కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:35 AM