ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సర్పంచ్‌ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

ABN, First Publish Date - 2023-12-11T01:09:34+05:30

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు బి.రాజేంద్రప్రసాద్‌ నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో నియోజకవర్గం సర్పంచ్‌ల సమావేశం ఆదివారం సాయంత్రం జిల్లాసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాల లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది.

జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు

కోరుకొండ, డిసెంబరు 10: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు బి.రాజేంద్రప్రసాద్‌ నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో నియోజకవర్గం సర్పంచ్‌ల సమావేశం ఆదివారం సాయంత్రం జిల్లాసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాల లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పాలనలో సర్పంచ్‌లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటికింటికీ తాగునీటి కుళాయిలను పథకం అయిన జలజీవన్‌ మిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తనవాటా నిధులు కేటాయించి వెంటనే ఆ పనులన్నీ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో మైనర్‌ గ్రామపంచాయతీలకు గతంలో ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల ప్రభుత్వం అడ్డుగోలుగా గ్రామపంచాయతీ దోచేస్తుందన్నారు. అదేవిధంగా ఈనెలలో జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ ఇన్‌చార్జ్‌బొడ్డు వెంకటరమణ చౌదరి, సర్పంచ్‌ల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు దూది కాంతారావు, పలువురుగ్రామసర్పంచ్‌లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising