పార్టీలకతీతంగా సర్పంచ్‌లు పోరాటం చేయాలి
ABN, First Publish Date - 2023-12-03T01:34:52+05:30
పార్టీలకతీతంగా సర్పంచ్‌లు పోరాటం చేయాలి
మలికిపురం, డిసెంబరు 2: పార్టీలకు అతీతంగా సర్పం చ్‌లు పోరాటం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావు అన్నారు. శనివారం లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో నియోజకవర్గ సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు అడబాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌ల సమావేశంలో గొల్లపల్లి మాట్లాడారు. గ్రామ పం చాయతీల సొమ్మును ప్రభుత్వం వైసీపీ దోచుకుందని, వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని అడ్డుకుందన్నారు. వైసీపీ పాలనలో గ్రామాలు భ్రష్టుపట్టిపోయాయన్నారు. వైసీపీ పాలనలో సర్పంచ్‌లు తలదించుకుని బతుకుతు న్నారని, సర్పంచ్ కంటే వలంటీరు మిన్న అనేపరిస్థితిలో గ్రామాలు ఉన్నాయన్నారు. రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్, చెల్లుబోయి హెలీన, కందికట్ల నిర్మల, యెనుముల నాగు, కోట పుష్పకుమారి, కడలి కనకదుర్గ, ముప్పర్తి అలివేలు గంగాత్రివేణి, రాపాక ఆనందకుమార్, ముదునూరి శ్రీనివా సరాజు, కడలి సత్యనారాయణ, ముప్పర్తి నాని, అడబాల చంటి, చాగంటి స్వామి, కౌరు శ్రీనివాస్, కడలి వెంకట రత్నం, వలవల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-03T01:34:53+05:30 IST