సంక్రాంతి దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:30 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెం.07653 కాచిగూడ-కాకినాడ, 07509 హైదరాబాద్-తిరుపతి రైళ్లు డిసెంబరు 28, జనవరి 4, 11, 18, 25న రాకపోకలు సాగిస్తాయి.
రాజమహేంద్రవరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెం.07653 కాచిగూడ-కాకినాడ, 07509 హైదరాబాద్-తిరుపతి రైళ్లు డిసెంబరు 28, జనవరి 4, 11, 18, 25న రాకపోకలు సాగిస్తాయి. రైలు నం.07654 కాకినాడ-కాచిగూడ, 07510 తిరుపతి-హైదరాబాద్ రైళ్లు డిసెంబరు 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయి. కాకినాడ రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయి. 1 ఏసీ, ఏసీ 2, 3 టెయిర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ తరగతుల బోగీలు ఉంటాయి. కాగా కాకినాడ-లింగంపల్లి (07445-సోమ, బుధ, శుక్ర), లింగంపల్లి-కాకినాడ (07446- మంగళ, గురు, శని) ప్రత్యేక రైళ్ల రాకపోకల తేదీలను ఫిబ్రవరి 1 వరకూ పొడిగించారు.
Updated Date - Dec 22 , 2023 | 12:30 AM