ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శంకర హర హర

ABN, First Publish Date - 2023-12-05T00:17:17+05:30

అఖండ గౌతమీ గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామ స్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి భక్తులు అధికసంఖ్యలో కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

  • పలుచోట్ల కార్తీక సోమవారం పూజలు.. పుణ్యస్నానాలు

కొవ్వూరు, డిసెంబరు 4 : అఖండ గౌతమీ గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామ స్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి భక్తులు అధికసంఖ్యలో కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన స్నానఘట్టంలోని శివలింగాలకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. మహిళలు అరటి డొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టారు. అనంతరం సుందరేశ్వరస్వామిని దర్శించుకుని పంచామృత అభిషేకాలు నిర్వహించారు. రావిచెట్టు వద్ద నాగశిలలను నదీ జలాలతో అభిషేకించారు. ప్రదాన స్నానఘట్టం, తులసి చెట్టు, రావిచెట్ల వద్ద సుందరేశ్వరస్వామి ఆలయంలో ద్వజ స్తంభం, నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేశారు. సాయంత్రం ఆలయంలో టీటీడీ నుంచి వచ్చిన దుర్గాబాయి పురంధరదాసు కీర్తనలు ఆలపించారు. అనంతరం జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. అలాగే మండలంలోని వాడపల్లి, తోగుమ్మి, ఆరికిరేవుల, కుమారదేవం, చిడిపి, పెనకనమెట్ట, ధర్మవరం, దొమ్మేరు, మద్దూరు, వేములూరు గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-12-05T00:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising