ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చీకటి దోపిడీ

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:53 PM

ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయిం ది.. అడ్డుకునేవారు లేరు.. ఆపేవారు లేరు.. దోపిడీ జరుగుతుందని అధికా రులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం గమనార్హం.

తాడిపూడి ర్యాంపులో ఇసుక డ్రెడ్జింగ్‌ అడ్డుకున్న యువగళం సభ్యులు, టీడీపీ నాయకులు

తాడిపూడిలో పట్టుకున్న యువగళం సభ్యులు

అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టని వైనం

తాళ్ళపూడి, డిసెంబరు 18 : ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయిం ది.. అడ్డుకునేవారు లేరు.. ఆపేవారు లేరు.. దోపిడీ జరుగుతుందని అధికా రులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం గమనార్హం.చాలా కా లంగా అధికారులది ఇదే తంతు.. అయితే డైరెక్టుగా పట్టుకుంటే అయినా అధికారుల్లో కదలిక వస్తుందని టీడీపీ యువగళం సభ్యులు చాలా కాలం గా చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాళ్ళపూడి మండలం తాడిపూడి బోట్స్‌ మెన్‌ సొసైటీ ఇసుక ర్యాంప్‌లో సోమవారం రాత్రి సమయంలో ఇసుక డ్రెడ్జింగ్‌ సాగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో టీడీపీ యువగళం నాయకులు సోమవారం రాత్రి తాడిపూడి రీచ్‌కు చేరుకుని ఇసుక డ్రెడ్జింగ్‌ ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క బోటు సుమారు 50 యూనిట్ల ఇసుకను తీసుకువస్తుందని సమాచారం అందించారు. అయితే అధికారులెవరూ రీచ్‌కు చేరుకోలేదు. గోదావరి నదిలో ఇసుక దోపిడీకి అడ్డేలేకుండా పోయిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు తెరలేపిందన్నారు. బోట్స్‌మెన్‌ సొసైటీ పడ వలు ఉండగా డ్రెడ్జింగ్‌ చేయడం యథేచ్ఛగా అక్రమ రవాణా కోసమేనని యువగళం నాయకులు పేర్కొన్నారు.ఇకనైనా అధికారులు కళ్లు తెరవా లని.. ఇసుక అక్రమ దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 11:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising