గోదాట్లో దొంగలు!
ABN, First Publish Date - 2023-11-24T00:04:56+05:30
ఇసుక వ్యాపారులు బరి తెగించారు.. గతంలో అధికారు లంటే భయపడేవారు... ఎవరు ఏ కేసు పెడతారోనని.. ఏ అధికారి వచ్చినా యంత్రాలు దాసేచేవారు.. ఇవాళ డ్రెడ్జింగ్ బోట్లను ఏకంగా పగటిపూట కూడా ర్యాంపుల్లో పెట్టి ఏం చేస్తారన్నట్టుగా చూస్తున్నారు.
చీకటిమాటున ఇసుక అక్రమ వ్యాపారం
ప్రతి రోజూ వందలాది లారీల్లో తరలింపు
జిల్లా కేంద్రానికి చేరువగానే ఘటనలు
బుర్రిలంక,బల్లిపాడులో ఆగని తవ్వకాలు
విజ్జేశ్వరంలోనూ మొదలు..
రాజమహేంద్రవరంలో డ్రెడ్జింగ్
అనుమతుల్లేకుండానే ఇష్టారాజ్యం
బరితెగించిన ర్యాంపుల నిర్వాహకులు
కన్నెత్తి చూడని కలెక్టర్.. అధికారులు
ఇసుక వ్యాపారులు బరి తెగించారు.. గతంలో అధికారు లంటే భయపడేవారు... ఎవరు ఏ కేసు పెడతారోనని.. ఏ అధికారి వచ్చినా యంత్రాలు దాసేచేవారు.. ఇవాళ డ్రెడ్జింగ్ బోట్లను ఏకంగా పగటిపూట కూడా ర్యాంపుల్లో పెట్టి ఏం చేస్తారన్నట్టుగా చూస్తున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీసి టన్ను ఏకంగా రూ.625కు అమ్ముకుని రూ.కోట్లు దోచేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే ఇదంతా సాగుతున్నా కనీసం కలెక్టర్ కూడా స్పందించడంలేదు.. మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై రకరకాల విమర్శలు వినిపి స్తున్నాయి.అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ విమర్శలు వదిలేశారు.
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఇసుక దోపిడీ అంతుపట్టని రహస్యంగా మారింది. ఎవరు అనుమతిచ్చారో, ఎవరికిచ్చారో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు. కానీ ఎవరు తవ్వుతున్నారో, ఎవరు ఇసుక వ్యాపారం చేస్తున్నారో కూడా అధికారులకు తెలుసు. కానీ అధికారికంగా ఎవరూ ధ్రువీకరించరు. రోజూ వేలాది లారీలతో గోదావరి ఇసుక తరలిపోతున్నా అధికార యంత్రాంగానికి అసలు కనిపించదు. గోదా వరిలో అనధికారికంగా డ్రెడ్జింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అఖండ గోదావరిలో సుమారు 25 డీసిల్టేషన్ ర్యాంపుల పేరిట ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ర్యాంపులకు అనుమతి ఉంటే యం త్రాల ప్రమేయం లేకుండా పడవల మీద ఇసుక తెచ్చి గట్టు మీద వేసి విక్రయించుకోవాలి. కానీ ధవళేశ్వరం పరిధిలోని గాయత్రీ ర్యాంపు, కాతేరు, వెంకటనగరం ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ జరుగుతుంది.
కన్నెత్తిచూడని అధికారులు..
అక్రమాలకు అనుగుణంగా డ్రెడ్జింగ్ బోట్లను తయారు చేయించారు. లారీల సైజులో ఉండే బోట్లలో ఇంజన్లు పెట్టి వాటికి డ్రెడ్జింగ్ మిషన్ల అమర్చుతున్నారు. వాటికి పెద్ద గొట్టాలు పెట్టి వాటిని గోదావరిలో ఇసుక ఉన్న ప్రాంతంలో దించుతారు. మిషన్ ఆన్‌చేయగానే ఇసుక గొట్టాల ద్వారా పడవలోకి వచ్చి పడుతుంది. ఇలా కొద్ది నిమిషాల్లోనే బోటునిండిపోతుంది. ఇక్కడ కేవలం ఇద్దరు మనుషులు ఉంటే చాలా చాలు. అది ఒడ్డున వేసి మళ్లీ డ్రెడ్జింగ్ చేస్తారు.ఇలా సుమారు 60కు పైగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఆరంభిస్తుంటే తెల్లారేసరికి గోదావరి ఒడ్డున ఇసుక కొండలా మారిపోతోంది. దానిని పగటి పూట అమ్మేస్తున్నారు. రాత్రులు మళ్లీ ఇదే తంతు. ఇక మన గోదావరిలో డ్రెడ్జింగ్‌కు అనుమతి లేదు.. పర్యావరం దెబ్బ తింటుందని, జీవరాశులు నశించిపోతాయని, గోదావరిలో చేపలకూ ఇబ్బందేనని చెప్పేవారు. గ్రీన్‌ట్రిబ్యునల్ గతంలో చాలా సీరియస్‌గా తీసుకునేది. డ్రెడ్జింగ్ చేయాల నుకుంటే అనేక అనుమతులు అవసరమయ్యేవి. ప్రస్తు తం అదేం అవసరం లేదు. ఎవరో నోటి మాటతో ఆదేశి స్తారు. అధికారుల నోటికి పాస్టర్ వేసుకుంటారు. ఎవర డిగినా మాకేమీ తెలియదనేదే జవాబు.
నోటి మాటతోనే ఆదేశాలు..
ఇసుక తీయాలంటే గతంలో ఓ పద్ధతి ఉండేది. మైనింగ్ అధికారులు ర్యాంపులు గుర్తించి అక్కడ ఇసుక తీసేవారికి అనుమతులిచ్చేవారు. ఒక ర్యాంపులో ఎంత ఇసుక ఉంటుంది.ఎంత తీయవచ్చు. ఎప్పటి లోగా తీయా లి అనే విషయాలతో పాటు సరిహద్దులు నిర్ణ యించేవా రు.దానికి మైనింగ్, ఇరిగేషన్, భూగర్భజలాలు, రెవెన్యూ అనుమతి అవసరమయ్యేది.తర్వాత పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండేది.కానీ ఇవాళ ఇవేమీ లేవు. వీటి గురి ంచి అధికారులు మాట్లాడడంలేదు. ఇసుక ఇష్టానుసారం తవ్వేసినా పట్టించుకునే పరిస్థితి లేదు.ఎంత తవ్వుతున్నా రో, ఎంత అమ్ముతున్నారో అధికారులకు తెలియదు.
అధికారులకే భయం..
ఇసుక అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఉంది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి దీనికి జిల్లాలో హెడ్‌గా ఉంటారు.ఇసుక, మద్యం అక్రమాలు అరికట్టడమే వీరి పని. కానీ ఆయన ఇసుక దోపిడీ వంక చూడడంలేదు.నెలాఖరుకు వచ్చే జీతం తీసుకుంటున్నారే తప్ప..అక్రమాలను మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.ఇంత దారుణంగా అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ముందు ముం దు కచ్చితంగా బుక్కవుతారు.ఎవరూ తప్పించుకోలేరు. ఈ భయం అధికారుల్లో ఉంది.కానీ ఉద్యోగాలు వదులు కోలేక భయపడుతూ బతుకుతున్నారు.రాబోయే రోజుల్లో ఈ అక్రమాలను ఎవరు బలవుతారో మరి.
రాత్రి తవ్వుకో.. పగలు అమ్ముకో..
నిడదవోలు, నవంబరు 23 : అర్ధరాత్రి వేళ గోదాట్లో దొంగలు పడుతున్నారు.ఇష్టానుసారం తవ్వేసి అక్ర మంగా తరలించేస్తున్నారు. కొందరు వైసీపీ నాయకుల అండదండలు ఉండడం, అధికారులు మామూళ్ల మత్తు లో జోగుతుండడంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. జిల్లాలోని నిడదవోలు మండలం విజ్జేశ్వరం, తాళ్ళపూడి మండలం బల్లిపాడు, కడియం మండలం బుర్రిలంకలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. వేలాది లారీల్లో ఇసుకను తరలించేస్తున్నారు. నిడదవోలు మం డలం పందల ప్రరులో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద నుంచి రెండు రోజుల కిందట వరకు ఇసుక అక్రమంగా విక్రయించారు.మరో పక్క విజ్జేశ్వరం ఏటిగట్టుపై ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలైతే చాలు వందలాది లారీలు ఇసుకకు క్యూ కడు తున్నాయి. ర్యాంపులు ఉన్న రోజుల్లో మూడు యూనిట్ల ఇసుక సుమారు రూ.8 వేలకు లభించగా ఇప్పుడు విజ్జే శ్వరం గోదావరి గట్టు నుంచి సుమారు మూడు యూ నిట్ల ఇసుక రూ.13 వేలకు విక్రయిస్తున్నారు. దీనికి కూడా భారీ డిమాండ్. విజ్జేశ్వరం గోదావరి గట్టుపై వందలాది లా రీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా మామూళ్ళ మత్తులో జోగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కొందరు వైసీపీ నాయకుల అండ దండలతోనే విజ్జేశ్వరం వద్ద అక్రమ ఇసుక రవాణా సాగుతుందని సమాచారం.జిల్లా వ్యాప్తంగా ఇసుక ర్యాంపులు మూతప డడంతో ఇసుకకు డిమాండ్ పెరి గింది. మరో పక్క కార్తీకమాసం శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు ఉండడం తో ఇళ్ళ నిర్మా ణాలకు ఇసుక ఎంతో అవసరం ఏర్పడింది. ఇసుక డిమాండ్‌ను దృష్టి లో పెట్టుకుని ఇసుకాసురులు కొందరు వైసీపీ నేతల అండదండలతో అధికారలను మామూళ్ళ మత్తులో ముంచుతూ అర్ధరాత్రి వేల గోదా వరి నుంచి అక్రమంగా ఇసుకను తరలించేసున్నారు.
ఇసుక దోపిడీపై 4న ఆందోళన
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 23 : వైసీపీ పాలనలో ఇసుక మాఫియా అక్రమాలు పెరిగిపోయాయని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దోపిడీపై డిసెంబరు 4వ తేదీన సీపీఐ ఆందోళన చేపడుతుందని వెల్లడించారు.సీపీఐ జనచైతన్యయాత్ర గురువారం నాల్గో రోజు జాంపేట, లక్ష్మివారపుపేట ప్రాంతాల్లో నిర్వహించారు.భవన నిర్మాణ కార్మిక సంఘాలతో చర్చించి దశలవారీ ఆందోళనలు సాగిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక అక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయన్నారు.ఆర్టీసీ కాంప్లెక్స్‌ను నగర శివార్లకు తరలించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారని, నగరం నలువైపులా లోకల్ బస్టాండ్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జట్ల సంఘం అధ్యక్షుడు కూండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జ్యోతిరాజు, లక్ష్మణ్, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-24T00:04:58+05:30 IST