భీమేశ్వరాలయంలో విశేష పూజలు
ABN, First Publish Date - 2023-12-11T00:05:22+05:30
సామర్లకోట, డిసెంబరు 10: కార్తీకమా సపర్వదినాలు పురస్కరించుకుని ఆదివా రం సామర్లకోట కుమార రామ భీమే శ్వరాలయంలో విశేష పూజలు నిర్వహిం చారు. గోపూజలతో ప్రారంభించారు. ఛీఫ్ ఫెస్టివల్ అధికారి, దేవదాయ సహాయ కమిషనర్ అల్లు వెంకటదుర్గాభవాని, ఆలయ ఈవో తలాటం వెంకట సూర్యనా
సామర్లకోట, డిసెంబరు 10: కార్తీకమా సపర్వదినాలు పురస్కరించుకుని ఆదివా రం సామర్లకోట కుమార రామ భీమే శ్వరాలయంలో విశేష పూజలు నిర్వహిం చారు. గోపూజలతో ప్రారంభించారు. ఛీఫ్ ఫెస్టివల్ అధికారి, దేవదాయ సహాయ కమిషనర్ అల్లు వెంకటదుర్గాభవాని, ఆలయ ఈవో తలాటం వెంకట సూర్యనా రాయణ ఆధ్వర్యంలో పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, కె.జోగారావు, చెరుకూరి రాంబాబుతో స్వామివారికి పంచ ద్రవ్యములతో అభిషేక, పుష్పార్చనపూ జలు నిర్వహించిన అనంతరం నూతన పట్టువస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. పండితులు చీమల కొండ గోపాలం తదితరు లతో నిర్వహించిన లక్షపత్రిపూజల్లో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చిత్తులూరి రాజా దంపతులు ఆశీనులయ్యారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద జరిగిన ఆకాశదీప పూజల్లో చిత్తులూరి రాజా దంపతులు పాల్గొన్నారు. రాత్రి ఆలయ ఆవరణలో జ్యోతిర్లింగార్చన పూజలు జరిగాయి. ఆలయ నిత్యాన్నదాన పథకంలో సుమారు 1,200 మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరించారు.
Updated Date - 2023-12-11T00:05:23+05:30 IST