ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సచివాలయ ఉద్యోగులకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత

ABN, Publish Date - Dec 14 , 2023 | 01:37 AM

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం అవుతుండడంతో ప్రభుత్వం బాటపట్టడంతో మూతపడిన అంగన్‌ వాడీ కేంద్రాలను తెరచి, నిర్వహించే బాధ్యతను సచివాలయ ఉద్యోగుల మీద మోపింది.

వంట బాధ్యత వలంటీర్లకు?

మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశం

తాళాలు పగలుకొట్టి కేంద్రాలు తెరవాలని సూచన

అది మా బాధ్యత కాదంటున్న సచివాలయ ఉద్యోగులు

అడ్డుకునే యత్నంలో అంగన్‌వాడీలు

రాజమహేంద్రవరం, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీల సమ్మె ఉధృతం అవుతుండడంతో ప్రభుత్వం బాటపట్టడంతో మూతపడిన అంగన్‌ వాడీ కేంద్రాలను తెరచి, నిర్వహించే బాధ్యతను సచివాలయ ఉద్యోగుల మీద మోపింది. వంట బాధ్యత అంతా వలంటీర్లకు అప్పగిస్తున్నట్టు సమాచారం. కానీ తాము ఈపనిచేయమని ఇప్పటికీ కొందరు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చి, ఎలాగైనా అంగన్‌వాడీ కేంద్రాలను తెరపించాలనే ప్రయత్నంలో ఉంది. అంగన్‌వాడీ వర్క ర్లు తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకూ సమ్మె విరమించే యోచన లేకపోవడంతో జిల్లాలో వేలాది మంది పిల్లలు, బాలింత, గర్భిణులు తీవ్ర అసౌ కర్యానికి గురైన సంగతి తెలిసిందే.వారికి పౌష్టికాహారం పంచేవారులేకపో యా రు. కానీ ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం వైపు దృష్టిపెట్టకు ండా, ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించడం గమనార్హం. దీనితో పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సి పాల్టీలలో కమిషనర్లు, మండలాలలో ఎంపిడిఓలు బాధ్యత తీసుకుని, సచివాల య ఉద్యోగుల చేత ఈపనిచేయించాలని ఆదేశించారు. గురువారం అంగన్‌వా డీ కేంద్రాలను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్‌ చేస్తున్నారు. గురువారం ఈబాధ్యత అప్పగించిన ఉద్యోగులు అంగన్‌వాడీ కేంద్రాల తాళం పగలగొట్టి, కేంద్రాలు తెరవాలి.అక్కడి ఫుడ్‌ తదితర వివరాలను పంచనామా ద్వారా రికార్డు చేయాలి. పంచనామాను వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు( వార్డు, గ్రామ, మహిళా సంరక్షణా కార్యదర్శి) నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితులలో నూ మొత్తం కేంద్రాలన్నీ తెరవాలనేది ప్రభుత్వ ఆదేశం ఇప్పటికే ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్ల ద్వారా ఎక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నం వండి పెట్టవలసిన 3నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు ఎంతమంది అనే సమాచారం సేకరించినట్టు తెలిసిందే. ఈనేపఽథ్యంలో గురువారం ఉదయం 9గంటలలోపు సచివాలయ సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. ఉదయం 9గంటల నుంచి12 గంటల వరకూ కేంద్రం తెరచి ఉండాలి. పిల్లలకు సమాచారం పంపి, వారిని రప్పించి అన్నం వండి పెట్టాలి. అన్నం వండే బాధ్యతను వలంటీర్లకు అప్పగిస్తున్నట్టు సమాచారం. అందులో ఇద్దరు మహిళా వలంటీర్లు, ఒక పురుష వలంటీరు ఉండాలనే అభిప్రాయం ఉంది.

సచివాలయ ఉద్యోగులలో ఆందోళన

అంగన్‌వాడీ కేంద్రాలు తాళాలు పగలుకొట్టి, వాటిని తెరవడం, అక్కడ సరుకును లెక్కించి, రికార్డు చేయడంతోపాటు, పిల్లలను రప్పించి అన్నం వం డి పెట్టడం, వారిని మధ్యాహ్నం 12గంటల వరకూ చూడడం వంటి అదనపు పనులన్నీ తామెలా చేస్తామని కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్న ట్టు సమాచారం. పైగా ఆందోళన చేస్తున్న వర్కర్కు, వారికి మద్ధతు ప్రకటి స్తున్న సంఘాలు కూడా అడ్డుకునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ తామెలా ఎదుర్కోవాలనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.

ఉద్యమం ఉధృతం

ప్రభుత్వం హామీలు పట్టించుకోకుండా, సమస్య పరిష్కారంమీద దృష్టి పెట్టకుండా అంగన్‌వాడీలను గాలికి వదిలేసి, సచివాలయ ఉద్యోగుల ద్వారా కేంద్రాలు నిర్వహించే ప్రయత్నాన్ని అంగన్‌వాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారంనుంచి పరిస్థితి ఎలా మారుతుందో మరి. సమ్మెను ఉధృతం చేసే ఆలోచనలోనే అంగన్‌వాడీ వర్కర్లు ఉండడం గమనార్హం

Updated Date - Dec 14 , 2023 | 01:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising