ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రుడా పనితనం ఇకపై చూపిస్తాం

ABN, Publish Date - Dec 28 , 2023 | 01:15 AM

ఎంత గాంభీర్యం ప్రదర్శించినా వైసీపీ అంతర్గత కుమ్ములాటకు పెట్టింది పేరని అడుగడుగునా రుజువవుతూనే ఉంది. రుడా చైర్మన్‌గా ఇటీవల రౌతు సూర్యప్రకాశరావు పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా రౌతు సేన ఆధ్వర్యంలో స్థానిక పోలీసు కన్వెన్షన్‌హాలులో ఆత్మీయ కలయిక, అభినం దన సభ ఏర్పాటుచేశారు.

రాజమహేంద్రవరం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎంత గాంభీర్యం ప్రదర్శించినా వైసీపీ అంతర్గత కుమ్ములాటకు పెట్టింది పేరని అడుగడుగునా రుజువవుతూనే ఉంది. రుడా చైర్మన్‌గా ఇటీవల రౌతు సూర్యప్రకాశరావు పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా రౌతు సేన ఆధ్వర్యంలో స్థానిక పోలీసు కన్వెన్షన్‌హాలులో ఆత్మీయ కలయిక, అభినం దన సభ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి అదే పార్టీకి చెందిన రుడా తాజా మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి హాజరుకాలేదు. ఆమె వర్గానికి చెందినవారూ దూ రంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడు తూ ఆమెపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. రుడా అంటే పార్కులు కట్టడం, పూలకుండీలు పెట్టడం, లైట్లు వేయడం వంటి పనులు చేయడా నికి కాదన్నారు. రుడా అంటే అర్బన్‌ డవలప్‌మెంట్‌ చేయడమన్నారు. రౌతు సార ఽథ్యంలో రానున్న రోజుల్లో రుడా పనితనం కనబడేటట్టు చేస్తామని స్పష్టంచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యే, ఓసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా పెద్ద పదవులు చేపట్టిన రౌతుకు రుడా చైర్మన్‌ అంతటి స్థాయి పదవి కాదన్నారు. అయినా పదవికి న్యాయం చేస్తారని తన ప్రగాఢ విశ్వాసమన్నారు. స్టేట్‌బ్యాంకు నుంచి రుణం తీసుకొని దేవర పల్లి, రాజానగరం, కడియం మార్గాల్లో ల్యాండ్‌పూలింగ్‌ చేసి విల్లాలు నిర్మిస్తామన్నారు. టీడీపీ హయాంలో రాజమండ్రి అభివృద్ధికి రూ.2 వేల కోట్లు వచ్చాయని చెబుతున్నా రని.. ఈ నాలుగున్నరేళ్లలో తాము రూ.400 కోట్లు తీసుకొచ్చామన్నారు. వైసీపీ నాయ కుల గౌరవాన్ని ఇకపై కాపాడతామని ఎంపీ భరత్‌రామ్‌, సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌లు స్పష్టంచేశారని.. ఆ మాటలను ఆచరణలో చూపాలంటూ రౌతు తనదైన శైలిలో మాట్లాడారు. దీంతో వైసీపీ వర్గపోరు మరోసారి స్పష్టమైంది.

Updated Date - Dec 28 , 2023 | 01:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising