ప్రకృతిని పరిరక్షించడమే ప్రధాన ధ్యేయం
ABN, First Publish Date - 2023-12-11T01:06:54+05:30
ప్రకృతిని పరిరక్షించడమే వనసమారాధనల ప్రధా న ధ్యేయమని ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అది మానవులకు అంత మేలు చేకూరుస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
ఘనంగా కార్తీక అన్న సమారాధనలు
అనపర్తి, డిసెంబరు 10: ప్రకృతిని పరిరక్షించడమే వనసమారాధనల ప్రధా న ధ్యేయమని ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అది మానవులకు అంత మేలు చేకూరుస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలో కోస్తాంద్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్తీక వనసమారాధనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కోస్తాంధ్రలోని 70గ్రామాల రెడ్డి సోదరులను ఒక చోటకు చేర్చాలన్న సంకల్పం తో కోస్తాంద్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కర్రి త్రినాధరెడ్డి వనసమా రాధన కార్యక్ర మాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. ముఖ్యంగా కోస్తాంద్ర ప్రాంతంలోని రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నా రు. కార్యక్ర మానికి వచ్చిన ప్రముఖులను సంఘం పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకట రెడ్డి, భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ విజయభాస్కరరెడ్డి, రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, తాడి చంద్రశేఖరరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, డాక్టర్ సత్తి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
సమాజ సమైక్యతకు కార్తీక సమారాధనలు దోహదం
రంగంపేట: సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక సమారాధనలు దోహదపడతాయని శ్రీ సత్యసాయి సేవా సంస్థల తుని సబ్‌జోన్ కన్వీనర్ తుమ్మలపల్లి జోగేంద్రనాథ్ అన్నారు. ఆదివారం రంగంపేట మండలం ముకుందవరం శ్రీ సత్యసాయి భజనమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో కాకినాడ జిల్లా సేవాదళ్ కన్వీనర్ పాలచర్ల శ్రీనివాస్, పెద్దాపురం సబ్‌జోన్ కన్వీనర్ కాశీవిశ్వేరరావు, వట్టికూటి సాయిచంద్రరావు, సుక్కిరెడ్డి గణేష్,రాంబాబు,గంగరాజు, ఎల్.శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.
రాజానగరం: కార్తీక మాసం ఆఖరుకు చేరుకోవడంతో మండలంలో గ్రామ గ్రామాన కార్తీక వన, అన్న సమారాధనలు ఆదివారం ఘనంగా చేపట్టారు. మండలంలో చక్రద్వారబంధంలోని శ్రీషిర్డీ సాయిబాబా మంది రం ఆధ్వర్యంలో నూ, రాజానగరంలోని కాపు సంఘీయులు ఆధ్వర్యంలో స్థానిక ముత్యాలమ్మ ఆలయంవద్ద ఏర్పాటుచేసిన కార్తీక అన్నసమా రాధనలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని బాబావారిని, ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈసందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ దూలం పెద్ద, నాయకులు కర్రి సత్తిబాబు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
రాజకీయ ప్రాధాన్యం ఉంటేనే రాజ్యాధికారంలో వాటా
ఫ మంత్రి చెల్లుబోయిన
దివాన్‌చెరువు: రాజకీయ ప్రాధాన్యం ఉంటేనే రాజ్యాధి కారం లో మనవా టాను మనం పొందగలమని, మనవారి అవసరాలను మనం చెప్పగలమని రాష్ట్ర వెనుకబడిన కులాల సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ అన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాఫుష్కర వనంలో ఆదివారం శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీశైన, యాత కులాల కార్తీక వనసమారాధన ఆదివారం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న మంత్రి మా ట్లాడుతూ వైస్సాఆర్ తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్‌మెంట్‌తో మన పిల్లలు ఉన్నత విద్యకు చేరువయ్యారన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారా యణ మాట్లాడుతూ సంఘీయులంతా తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో సీటుతెచ్చుకున్న సంఘీయులను భారీమెజార్టీతో గెలిపించి అసెంబ్లీ, పార్లమెంటులలో కూర్చోపెట్టాలని కోరారు. ఐదుకులాలు ఉన్నా మనందరిదీ ఒకటే కులమనీ కల్లుగీత కులమని అన్నారు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, నాయకులు గూడూరి శ్రీనివాస్. గౌతుశిరీష, మార్గాని నాగేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, బుడ్డిగర శీనివాస్, రెడ్డిరాజు, కుడుపూడి సారధి, మార్గాని చంటిబాబు, వంక మల్లిబాబు పాల్గొన్నారు
తాడాల చక్రవర్తి నర్సరీలో వన సమారాధన సందడి
కడియం: కడియం మండలం బుర్రిలంకలో ఈశ్వర్ పామ్‌నర్సరీ అధినేత వైసీపీ కడియం మండలం బూత్ కమిటీ కన్వీనర్ తాడాల చక్రవర్తి నర్సరీలో ఆదివారం కార్తీక వనభోజనాల కార్యక్రమం సందడిగా జరిగింది. తొలుత ఉసిరి చెట్టుకు పూజలు చేసి కార్తీక దామోదరున్ని కొలిచి వన సమారాధన చక్రవర్తి ప్రారంభించారు. దీనికి ముఖ్యఅతిథులుగా జక్కంపూడి విజయలక్ష్మి, చందన నాగేశ్వర్, ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్, గిరిజాల బాబు, యాదవ సతీష్, చంద్రస్టాలిన్, పలువురు నర్సరీ రైతులు పాల్గొన్నారు. అతిఽథులందరికీ తాడాల చక్రవర్తి ఆయన కుమారులు కుమార్, అనిల్‌లు స్వాగతం పలికారు. ముఖ్యఅతిఽథు లను సత్కరించారు.
గుర్తించిన పార్టీలకే మద్దతు
వెలమ సంఘం కార్తీక వనసమారాధనలో నేతలు
రాజమహేంద్రవరం సిటీ: తమను గుర్తించి అవకాశాలు ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని వెలమ సంఘం నేతలు అన్నారు. రాజమహేంద్రవరంరూరల్ మండలం నామవరం సమీపంలో ఆదివారం గొర్లి సూరి అప్పారావు తోటలో జరిగిన వెలమ కార్తీక వన సమారాధనలో ఉసిరి చెట్టుకు పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించారు. గత 20 ఏళ్ళుకు పైగా క్రమం తప్పకుండా సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి వెలమ కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ డిప్యూటి మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నగర వెలమ సంఘం అధ్యక్షుడు కిలపర్తి శ్రీనివాస్, కార్యదర్శి సప్పా వెంకట రమణ, అల్లు బాబి, నర్సిపల్లి హారిక, కోళ్ళ బాబు, వాసిరెడ్డి కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T01:06:56+05:30 IST