ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ను ప్రజలు తరిమికొట్టడం ఖాయం

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:22 AM

పిఠాపురం రూరల్‌, డిసెంబరు 17: ప్రజలు కష్టాలో ఉన్నా పట్టించుకోని సీఎం జగన్‌ను, వైసీపీ ని ప్రజలు మూడు నెలల్లో తరిమికొట్టడం ఖాయమని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఆదివారం రాత్రి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. వారందరికి శ్రీనివాస్‌ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడు

చిత్రాడలో జనసేనలో చేరినవారితో తంగెళ్ల

జనసేన పిఠాపురం ఇన్‌చార్జి తంగెళ్ల

పిఠాపురం రూరల్‌, డిసెంబరు 17: ప్రజలు కష్టాలో ఉన్నా పట్టించుకోని సీఎం జగన్‌ను, వైసీపీ ని ప్రజలు మూడు నెలల్లో తరిమికొట్టడం ఖాయమని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఆదివారం రాత్రి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. వారందరికి శ్రీనివాస్‌ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన విజయం ఘన విజయం సాధించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. వైసీపీ నేత లు ప్రజాసమస్యల పరిష్కారం మాని పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్‌ను ప్యాకేజీస్టార్‌ అనే ఈ నాయకులకు ఆయనను కొనే దమ్ముందా అని సవాల్‌ చేశారు. నీతినిజాయితీల తో పవన్‌ రాజకీయం చేస్తున్నారని, తన సొంత డబ్బులతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు చిత్రాడ మ హాలక్ష్మీ ఆలయం నుంచి ఈబీసీ కాలనీ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, జనసైనికులున్నారు.

వైసీపీ నుంచి జనసేనలోకి చేరిక

సామర్లకోట, డిసెంబరు 17: పట్టణ పరిధిలో 9వ వార్డు పెన్షన్‌లైన్‌లో వైసీపీకి చెందిన సుమా రు 60మంది కార్యకర్తలు ఆదివారం జనసేన పా ర్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మల బాబు సమక్షంలో జనసేనలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి అభివృద్ధి, సంక్షేమం అమలు చేసేం దుకే పార్టీ సిద్ధాంతాలను అధినేత పవన్‌ రూపొ ందించారని తుమ్మల అన్నారు. పార్టీ నేతలు సరోజావాసు, జానకిరామారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంచెం సాయిబా బు, పోలినాటి అభిషేక్‌ గౌతమ్‌, అత్తిలి కృష్ణ, సాయినాయుడు, పెంకే వెంకటలక్ష్మి, బుచ్చిరాజు, కంచుమర్తి రాజన్న, పెన్షన్‌ లైన్‌ జనసేన నాయ కులు దవుల్ల సత్తిబాబు, రవితేజ, దాసు, విజయ్‌, ధామస్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:22 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising