ధరల పెంపుతో ప్రజల జీవితాలు అతలాకుతలం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:20 AM
గొల్లప్రోలు, డిసెంబరు 17: అన్నిరకాల వస్తువుల ధరలు, పన్నులు, కరెంటు చార్జీల పెంపుతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, సామాన్యుడు కుటుంబా న్ని పోషింలేని పరిస్థితికి చేరుకున్నాడని, ఇందు కు వైసీపీ ప్రభుత్వమే కారణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ ఆశీర్వది
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలు, డిసెంబరు 17: అన్నిరకాల వస్తువుల ధరలు, పన్నులు, కరెంటు చార్జీల పెంపుతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, సామాన్యుడు కుటుంబా న్ని పోషింలేని పరిస్థితికి చేరుకున్నాడని, ఇందు కు వైసీపీ ప్రభుత్వమే కారణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ ఆశీర్వదిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. వర్మ మాట్లాడుతూ కరెంటు చార్జీలను ఇప్పటికి 9సార్లు పెంచారని, టీడీపీ పాలనలో కంటే నాలుగైదు రెట్లు అధిక ంగా బిల్లులు వస్తున్నాయన్నారు. ఇంటి పన్ను భారీగా పెంచడంతో పాటు తుగ్లక్ జగ న్ చెత్త పన్ను విధించారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ప్రజాసమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారని విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలన్నింటిలో 2పంటలకు సాగునీరందించే విధంగా టీడీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ ఆపేసిన పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు ఏలేరు ఆధునీకరణ చేపడతామని లోకేశ్ ప్రకటించారన్నారు. టీడీపీ మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:20 AM