పందలపాక కాలువపై పట్టి తొలగింపుతో వివాదం
ABN, Publish Date - Dec 31 , 2023 | 01:38 AM
అనపర్తి మండలం కొప్పవరంలో పందలపాక బోది కాలువపై ఉన్న పట్టి తొలగింపుతో వివాదం చోటుచేసుకుంది. ఇటీవల ఒక వర్గం వారు పట్టిని తొలగించడంతో శనివారం రెండవ వర్గం వారు పట్టిని తిరిగి ఏర్పాటు చేస్తుండటంతో వివాదం చెలరేగి బాహాబాహీకి దారి తీసింది.
బాహా బాహీకి దిగిన ఇరువర్గాలు
పోలీసుల ప్రమేయంతో సద్దుమణిగిన వివాదం
అనపర్తి, డిసెంబరు 30 : అనపర్తి మండలం కొప్పవరంలో పందలపాక బోది కాలువపై ఉన్న పట్టి తొలగింపుతో వివాదం చోటుచేసుకుంది. ఇటీవల ఒక వర్గం వారు పట్టిని తొలగించడంతో శనివారం రెండవ వర్గం వారు పట్టిని తిరిగి ఏర్పాటు చేస్తుండటంతో వివాదం చెలరేగి బాహాబాహీకి దారి తీసింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పందలపాక బోది కాలువకు ఇటువైపున సుమారు 50కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలో పంపులు ఉప్పు నీరు రావడంతో వీరంతా కలసి కాలువకు అవలి ప్రక్కన కొద్దిగా స్థలాన్ని కొనుగోలుచేసి అక్కడ చేతి పంపును ఏర్పాటుచేసుకుని అక్కడి నుంచి మంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రక్రియ సుమారుగా 40 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే నాలుగురోజుల క్రితం కాలువకు అటువైపున ఉన్న వారు పట్టిని తొలగించ డంతో ఇటు ఉన్న వారికి మంచినీరు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఏర్ప డ్డాయి దీంతో వీరంతా శనివారం తొలగించిన పట్టిని తిరిగి ఏర్పాటు చేసేం దుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒక వర్గంవైపు ఒక వైసీపీ నేత, మరోవర్గం వైపు మరో వైసీపీ నేతలు ఉన్నప్పటికీ వివాదం సద్దుమణగలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జగన్మో హనరావు తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వివాదం పెద్దది కాకుండా ఇరు వర్గాలకు సర్ధి చెప్పారు. చివరకు అక్కడికి చేరుకున్న సీఐ శివగణేష్ ఇరు వర్గాల తోను చర్చించి తిరిగి పట్టి ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతో 50 కుటుంబాలకు చెందిన మహిళలు పోలీసులకు కృతజ్ఞతలు
Updated Date - Dec 31 , 2023 | 01:38 AM