ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధాన్యం రెడీ.. గొనె సంచులేవీ..?

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:26 AM

దిగుబడి ఉంటే ధర పలకదు. ధరపలికితే దిగుబడి ఉండదు. ఈ రెండు బాగున్నాయంటే ప్రకృతి వైపరీత్యాలతో పంట పాడై రైతు నష్టాల బాట పడతారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజ న్‌లో భాగంగా రైతులు పండించిన వరి అధిక దిగుబడి ఇచ్చింది. అయితే మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా కొంత పంట నీట మునగగా మరికొంత పంట వరదనీటిలో మునిగి పనికిరాకుండా పోయింది. మిగిలిన కాస్తో కూస్తో పంటను రైతులు నానా తంటాలుపడి వరి యంత్రాలకు అధిక ధర చెల్లించి మరీ ధాన్యాన్ని రోడ్ల పైకి చేర్చారు.

చిట్యాల గ్రామ శివారులో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం.

  • అష్టకష్టాలు పడి ధాన్యం ఒబ్బిడి చేసినా.. సంచులు అందుబాటులో లేక రైతులకు ఇబ్బందులు

  • ఆర్బీకేల్లో చిల్లుల సంచులే గతి.. అన్నదాతలకు తప్పని అదనపు భారం

గోపాలపురం, డిసెంబరు 25: దిగుబడి ఉంటే ధర పలకదు. ధరపలికితే దిగుబడి ఉండదు. ఈ రెండు బాగున్నాయంటే ప్రకృతి వైపరీత్యాలతో పంట పాడై రైతు నష్టాల బాట పడతారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజ న్‌లో భాగంగా రైతులు పండించిన వరి అధిక దిగుబడి ఇచ్చింది. అయితే మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా కొంత పంట నీట మునగగా మరికొంత పంట వరదనీటిలో మునిగి పనికిరాకుండా పోయింది. మిగిలిన కాస్తో కూస్తో పంటను రైతులు నానా తంటాలుపడి వరి యంత్రాలకు అధిక ధర చెల్లించి మరీ ధాన్యాన్ని రోడ్ల పైకి చేర్చారు. ఇంతచేసినా.. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఎన్నో వ్యయప్రయాసలు పడి గట్టెక్కించిన ధాన్యాన్ని విక్రయి ద్దామంటే ఇప్పుడు గోనె సంచుల సమస్య వెంటాడు తోంది. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లర్లకు ఎగుమతి చేసు కోవాలనే సమయంలో రైతులు కాళ్లరిగేలా రైతు భరోసా కేంద్రం చుట్టూ గోనెసంచుల కోసం ప్రదక్షిణలు చేసే పరిస్థితి నెలకొంది. గత 15 రోజుల నుంచి గోనె సంచు లు అందుబాటులో లేక ఆర్‌బీకేలో ఉన్న చిల్లులుపడిన సంచులు తీసుకోలేక రైతులు సతమతం అవుతున్నారు. దీంతో రోడ్ల పక్కన నిల్వ ఉంచిన ధాన్యం కోసం తెచ్చిన బరకాలకు అద్దెకట్టడం అదనపు భారంగా మారింది.

Updated Date - Dec 26 , 2023 | 01:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising