ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వదలని వర్రీ!

ABN, First Publish Date - 2023-11-06T00:05:24+05:30

అన్నదాతల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు.. మొన్న కొవ్వూరు.. నిన్న కడియం తదితర ప్రాంతాల్లో రైతులను ముంచాడు.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంట నేలకొరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

కడియంలో నేలకొరిగిన వరి పంట

అక్కడక్కడా నేలకొరిగిన పంట

ఆందోనలో రైతాంగం

దిగుబడి తగ్గుతుందని భయం

సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారుల సూచన

కడియం, నవంబరు 5 : అన్నదాతల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు.. మొన్న కొవ్వూరు.. నిన్న కడియం తదితర ప్రాంతాల్లో రైతులను ముంచాడు.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంట నేలకొరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతి వరకూ వచ్చిన పంట నోటి వరకూ వస్తుందో లేదోనని భయపడుతున్నారు. మరో పది రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో నేలకొరగడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు. తొలకరి సీజన్‌లో ప్రతి ఏటా పంట మునిగి ఎంతో కొంత నష్టం వాటిల్లేది. అయితే ఈ ఏడాది అంతంతమాత్రంగా వర్షాలు ఉండడంతో ఎక్కడా పంటకు నష్టం వాటిల్లలేదు. ఇప్పటి వరకూ ఎక్కడా చేలు పడిపోవడం.. నీట మునిగిపోవడం తదితర ఇబ్బందుల్లేవ్‌.. ఈ నేపథ్యంలో రైతులు ఆనందంగా ఉన్నారు. త్వరలో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో పంట నేలకొరగడంపై.. కోత ఖర్చులు రెండింతలు పెరుగుతాయని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయశాఖ గ ణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పంట నేలకొరిగినట్టు సమాచారం. రాజమహేంద్రవరం రూరల్‌ , కొవ్వూరు, కడియం, రాజానగరం, అనపర్తి తదితర మండలాల్లో పంట నష్టం స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై కడియం వ్యవసాయాధికారి ద్వారకాదేవి మాట్లాడుతూ నేలకొరిగిన కొద్దిశాతం పంటపై రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఉండదన్నారు. తమ పంటను నిలకట్టి నీరు పోయేలా చూసుకోవాలన్నారు. ట్యాంకు ఒక్కంటికి 50 గ్రాముల ఉప్పును పిచికారీ చేస్తే ధాన్యం పాడవకుండా ఉంటుందని తెలిపారు.

కష్టమే మిగిలింది..

నేను ఎకరా భూమి కౌలుకి చేస్తున్నా. ఈ ఏడాది వర్షం ప్రభావం పెద్దలేదనుకున్నా.. అయినా పంటకు తెగులు సోకి నిన్నటి వరకూ సుమారు 20 బస్తాల దిగుబడి వచ్చేలా ఉంది. శిస్తు 10 బస్తాలు ఇవ్వాలి.. మిగిలేది 10 బస్తాలు.. ప్రభుత్వ ధర ప్రకారం రూ. 15 వేల వరకూ వస్తుంది.. తొలకరి సాగుకు సుమారు రూ. 20,100 వరకూ ఖర్చు చేశా. అంటే ఇప్పటి వరకూ నేను పెట్టిన పెట్టుబడి రాలేదు. ఇంకా కోతకోయడానికి, ఽధాన్యం తోలడానికి ఖర్చులు అవుతాయి. ఇక నాకు మిగిలేది ఏమి ఉంది. కష్టం తప్ప. ఇప్పుడేం చేయాలో తోచడం లేదు.

చవ్వాకుల సుబ్బారావు, కడియం

Updated Date - 2023-11-06T00:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising