ఓటే వజ్రాయుధం: పెద్దాపురం ఆర్డీవో
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:41 AM
ధృడమైన ప్రజాస్వామ్యానికి ఓటే వజ్రాయుధమని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఓటువేసే విధానం, ఓటుహక్కు తదితర విషయాలపై అవగాహ న కల్పించేందుకు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన గురువారం పాల్గొన్నారు.
పెద్దాపురం, డిసెంబరు 21: ధృడమైన ప్రజాస్వామ్యానికి ఓటే వజ్రాయుధమని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఓటువేసే విధానం, ఓటుహక్కు తదితర విషయాలపై అవగాహ న కల్పించేందుకు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన గురువారం పాల్గొన్నారు. స్థానిక ఆర్డీవోకార్యాలయం నుంచి కొత్తపేట గుర్రాల సెంటర్ వరకూ ఈ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి ఆర్డీవో సీతారామారావు మాట్లాడుతూ ఓటువేసే విధానంపై ప్రతీఒక్కరూ అవగాహన కలిగిఉండాలన్నారు. డీఎస్పీ ల తాకుమారీ, తహశీల్దార్ వజ్రపు జితేంద్ర, మున్సిపల్ కమి షనర్ సురేంద్ర, సీఐ రవికుమార్, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
సర్పవరం జంక్షన్, డిసెంబరు 21: ప్రతీ పోలింగ్ కేంద్రా న్ని పరిశీలించి మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఏ ర్పాట్లు చేపట్టాలని కాకినాడ ఆర్డీవో, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలకో్ట్రరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఇట్ల కిషోర్ కోరారు. గురువారం రమణయ్యపేట మండల కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు సంబంధించిన సెక్టోరల్, రూట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడరూరల్ ని యోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాలను 144 జోన్లుగా విభజించి, 26మంది సెక్టోరల్, రూట్ అధికారులను నియ మించామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో పర్యటించి, మౌళిక వసతులకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి పూర్తిస్థాయిలో పోలింగ్ కేంద్రా ల్లో మౌళిక సదుపాయాలు ఉండాలన్నారు. సమావేశంలో రూరల్, కరప మండల తహశీల్ధార్లు వీరవల్లి మురార్జీ, పి. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు, పోలీసులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 12:41 AM