ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతి దరఖాస్తు నమోదు చేయాలి

ABN, First Publish Date - 2023-12-03T00:51:27+05:30

స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో వచ్చే ప్రతి దరఖాస్తును, ఆ దరఖాస్తుపై తీసుకున్న చర్యలు రిజిస్టరులో నమోదు చేయాలని ఈఆర్వో సరళా సుందరం చెప్పారు.

ఓటర్ల నమోదు ప్రక్రియ పరిశీలిస్తున్న ఈఆర్వో సరళాసుందరం

  • రాజమహేంద్రవరం రూరల్‌ ఈఆర్వో సరళాసుందరం

  • పలుచోట్ల ఓటు నమోదు ప్రత్యేక కార్యక్రమం

రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 2: స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో వచ్చే ప్రతి దరఖాస్తును, ఆ దరఖాస్తుపై తీసుకున్న చర్యలు రిజిస్టరులో నమోదు చేయాలని ఈఆర్వో సరళా సుందరం చెప్పారు. ఓటర్‌ నమోదు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోలమూరు పంచాయతీ పరిధిలో పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 జనవరి 2024కు 18 ఏళ్ల వయస్సు నిండే ప్రతిఒక్కరూ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఈ నెల 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు గుర్తింపు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, తొలగింపులు, కొత్త ఓట్లు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సాగర్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T00:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising