ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నన్నయలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:11 AM

కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ టొబాకో సైన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు, వాణిజ్య వ్యవసాయంలో భవిష్యత్తు కాలంలో వాణిజ్య వ్యవసాయానికి సన్నద్ధత-దిశా నిర్దేశాలు అనే అంశంపై ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారంతో ఘనంగా ముగిసింది.

దివాన్‌చెరువు, డిసెంబరు 16 : కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ టొబాకో సైన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు, వాణిజ్య వ్యవసాయంలో భవిష్యత్తు కాలంలో వాణిజ్య వ్యవసాయానికి సన్నద్ధత-దిశా నిర్దేశాలు అనే అంశంపై ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారంతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సీటీఆర్‌ఐ డైరెక్టర్‌, ఐఎస్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ మాగంటి శేషుమాధవ్‌ మాట్లాడుతూ వాణిజ్య వ్యవసాయంపై పరిశోధనలను కేంద్రీకరించడానికి, భవిష్యత్‌ కార్యక్రమాలు రూపొందించడానికి అంతర్జాతీయ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. భారతదేశంలో భౌగోళిక ప్రాంతాలకు అనువైన విభిన్న పసుపు రకాలు, ఇతర పంటలను సాగు చేయడం ద్వారా ఉత్పత్తి, నాణ్యమైన ఎగుమతులకు అపారమైన అవకాశం ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడ్డారు. వాణిజ్య పంటల అభివృద్ధికి మొక్కల జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ జోక్యం ద్వారా దిగుబడి, నాణ్యతను గుర్తించడంలో సహాయపడతాయని, జీనోమ్‌ ఎడిటింగ్‌, ట్రాన్నజెనిక్‌ క్రాప్స్‌, మొలేక్యులర్‌ బ్రీడింగ్‌ వంటి అంశాలను పరిశోధన ల్లో చేర్చాలని, వ్యాధి నిరోధకత తట్టుకునే రకాలను అభివృద్ధి చేయవచ్చని నిపుణులు సూచించారు. ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, పర్యావరణానికి ఆనుగుణంగా రసాయనాల వినియోగం తగ్గించడం, తద్వారా తలెత్తే తెగుళ్లు, వ్యాధుల నిర్వహణ కోసం సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం అత్యవసరమని, ప్రణాళికాబద్ధమైన వ్యవసాయం, నానో టెక్నాలజీపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల ప్రదర్శనకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - Dec 17 , 2023 | 12:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising