ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

27న నన్నయ పరిధిలో స్పాట్‌ అడ్మిషన్లు

ABN, Publish Date - Dec 21 , 2023 | 01:34 AM

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థానిక క్యాంపస్‌తో పాటు, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లకు సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 27న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య కె.పద్మ రాజు అన్నారు.

దివాన్‌చెరువు, డిసెంబరు20 : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థానిక క్యాంపస్‌తో పాటు, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లకు సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 27న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య కె.పద్మ రాజు అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవ ారం ఆయన తెలిపారు. ఏపీఐసెట్‌ 2023లో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈడబ్ల్యూఎస్‌, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కేటగిరీలలో పరి మిత సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం స్థానిక ప్రాంగణంలో ఎంబీఏ 11 సీట్లు, ఎంబీఏ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ 18 సీట్లు, ఎంసీఏ ఎనిమిది సీట్లు ఉన్నాయన్నారు. కాకినాడ ప్రాంగణంలో ఎంబీఏ24, ఎంసీఏ 17 సీట్లు ఉన్నాయన్నారు. తాడేపల్లి గూడెం క్యాంపస్‌లో ఎంబీఏ 21 సీట్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో స్పాట్‌ అడ్మిషన్‌కు హాజరుకావాలని సూచించారు. ప్రవేశం నిర్ధారణ అయిన వెంటనే ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ స్పాట్‌ అడ్మిషన్లుకు సంబంధించి మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు.

Updated Date - Dec 21 , 2023 | 01:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising