ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eluru: మంత్రి కొట్టు, ఎంపీ శ్రీధర్‌ను బురిడీ కొట్టించిన ద్వారకాతిరుమల ఆలయ అధికారులు

ABN, First Publish Date - 2023-10-25T09:07:55+05:30

ఏలూరు జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ శ్రీధర్‌ను ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు బురిడీ కొట్టించారు. రెండు రోజుల క్రితం ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానంలో వైసీపీ అభిమానులకు భోజనాలు పెట్టించారు. దీని కోసం..

ఏలూరు జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ శ్రీధర్‌ను ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు బురిడీ కొట్టించారు. రెండు రోజుల క్రితం ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానంలో వైసీపీ అభిమానులకు భోజనాలు పెట్టించారు. దీని కోసం దేవస్థానం అధికారులు ఎంపీ దగ్గర రూ.3 లక్షలు వసూలు చేశారు. శేషాచల కొండపై ఏర్పాటు చేసిన భోజనాలు వివాదాస్పదమయ్యాయి. ఎంపీ శ్రీధర్ ఇచ్చిన చెక్కును అన్నదానం ట్రస్టు పేరున కాకుండా ఓ అధికారి పేరిట తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవస్థానం అన్నదానం ట్రస్టుకు ఇచ్చినట్లుగా అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో రూ. 3 లక్షలు అన్నదాన ట్రస్టుకు నష్టం వాటిల్లింది.

మంత్రి కొట్టు సత్యనారాయణకు సయితం అన్నదాన ట్రస్టుకు ఇచ్చినట్లుగా ఆలయ అధికారుల నమ్మించారు. చెక్కు చూపమని అడిగితే బ్యాంకులో వేసామని బుకాయించారు. ఇప్పటి వరకు అన్నదాన ట్రస్టుకు ఎవరు విరాళం ఇచ్చిన చెక్కును చూపుతూ వెంటనే అధికారులు రసీదు ఇస్తున్నారు. మరి ఎంపీ శ్రీధర్‌ భోజనాల కోసం విరాళం ఇచ్చినట్లు ఇప్పటి వరకు అన్నదానం ట్రస్ట్ తరఫున రసీదు లేదు. చెక్ విషయంపై ఆలయంలో ఏ అధికారిని అడిగిన ఈవోకు తప్ప తమకు ఏమీ తెలియదని ఉద్యోగులు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-25T09:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising