Home » Dwaraka Tirumala
ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 3వ తేదీతో ఈ బ్రహోత్సవాలు ముగుస్తాయి.
ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల స్కాం వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు రాజుతోపాటు మరో ఆరుగురు దేవస్థానం ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెప్పారు.
రాష్ట్రంలోని మరో రెండు ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా ఎన్.వి.సుధాకర్ రావుతోపాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు. సప్త గోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను త్రాచుపాములు కాటు వేశాయి.
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
Dwaraka Tirumala: చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు.
Ganesh Sharma: కంచికామకోటి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సత్యవెంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ద్వారకా తిరుమలలో రుగ్వేదం అభ్యసించారు. వేసవి సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమాన ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను అదే సమయంలో తిరుపతి వచ్చిన కంచి కామ కోటి పీఠం శంకరాచార్య స్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది.