Dwarka Tirumala: భక్తులకు అలర్ట్.. సుప్రభాత సేవ రద్దు
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:17 AM
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏలూరు జిల్లా , డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయ (Dwarka Tirumala Chinna Venkanna Temple) పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్థానంలో తిరుప్పావై సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఈనెల 29వ తేదీన స్వామివారి పాదుకా మండపం నుంచి శేషాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షణ జరుగుతుందని వెల్లడించింది. ఈనెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని వివరించింది. ఈనెల 30వ తేదీన నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఆలయంలో స్వామి వారికి సాయంకాలం రోజు జరిగే ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పాలక మండలి ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
Read Latest AP News And Telugu News