Share News

అన్నవరం, చిన్న తిరుపతి దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల నియామకం

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:56 PM

రాష్ట్రంలోని మరో రెండు ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా ఎన్.వి.సుధాకర్ రావుతోపాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది.

అన్నవరం, చిన్న తిరుపతి  దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల నియామకం

అమరావతి, ఏప్రిల్ 07: రాష్ట్రంలోని మరో రెండు ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా ఎన్.వి.సుధాకర్ రావుతోపాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది. అలాగే కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా ఇనుకంటె వెంకట రోహిత్‌తోపాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ రెండు దేవాలయాల్లోని పాలక మండలి సభ్యులుగా 13 మంది టీడీపీ, 2 జనసేన, ఒక బీజేపీ సభ్యులకు చోటు కల్పించింది. ఇప్పటికే తిరుమల తిరుపతి, విజయవాడ దుర్గ గుడి, శ్రీశైలం దేవాలయాల చైర్మన్లు, పాలక మండలి సభ్యులను ప్రభుత్వం నియమించింది. అలాగే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వరుసగా నామినేటెడ్ పోస్టులను దశల వారీగా భర్తీ చేసిన విషయం విదితమే.


2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి బరిలో నిలిచి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు, దేవాలయాల పాలక మండలిలో ఈ మూడు పార్టీలకు చెందిన నేతలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్‌ పరిమితం: హరీశ్ రావు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 04:06 PM