మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:51 PM
హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించడంపై మీడియా సంఘాలు స్పందించాయి. ఈ దాడిని ఐకేయూ, ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండించాయి.
అమరావతి, ఏప్రిల్ 7: హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించడంపై మీడియా సంఘాలు స్పందించాయి. ఈ దాడిని ఐకేయూ, ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండించాయి. ఒక మీడియా సంస్థను నిర్వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇలాంటి చర్యలకు సొంత పార్టీలోని వారిని ఉసిగొల్పటం మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదని జర్నలిస్టు సంఘాల నేతలు డి.సోమసుందర్(IJU), ఐ.వి.సుబ్బారావు(APUWJ), ఏచూరి శివ (ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్) స్పష్టం చేశారు.
ఏపీ రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని.. దానికి మావిగన్ అనే పేరు పెట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించారు. అది కూడా రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందే క్రమంలో వైఎస్ జగన్ ఈ ప్రతిపాదన చేయడం విమర్శలకు తావిచ్చింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రత్యేక కథనాన్ని రాశారు. దీనిపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ఆ పార్టీలోని కీలక నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. స్పందించారు. అందులోభాగంగా మంగళవారం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఇవి కూడా చదవండి...
జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్
తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
Read Latest TG News And Telugu News