Share News

'మీడియా సంస్థలపై దాడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు'

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:58 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపి నేతలు దాడికి దిగిన ఘటనపై ఆ సంస్థ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి తీవ్రంగా స్పందించారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

'మీడియా సంస్థలపై దాడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు'

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై మంగళవారంనాడు వైసీపీ శ్రేణులు దాడికి దిగిన విషయం తెలిసిందే. మావిగన్ గురించి ప్రశ్నిస్తూ ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై రాద్ధాంతం చేస్తూ.. ఆందోళన ముసుగుతో ఈ రకంగా దాడులకు పాల్పడింది వైసీపీ. ఈ దాడులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ‘ఎక్స్’ తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు జరగడం ఆందోళన కలిగించే విషయమన్న ఆయన.. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు కీలక సూచన చేశారు.


మీడియా అనేది సమాజానికి సమాచారాన్ని అందించే ఓ ప్రధాన వేదిక. ఇది ప్రభుత్వ, ప్రజావిధానాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాలు, అలాగే ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుంది. ప్రజాభిప్రాయాలను బయటపెట్టేందుకు ఏ దృక్పథం నుంచైనా కీలక పాత్ర పోషిస్తుంటుంది. మీడియా సంస్థలు వాటి పని అవి చేస్తుంటాయి. వాణిజ్య సంస్థల్లా తమ స్వతంత్రతను పాటిస్తూ సమాచారాన్ని అందిస్తుంటాయి. అలాంటి సంస్థలపై దాడులకు యత్నించడం దుర్మార్గమైన చర్య అవుతుంది.

రాజకీయ పార్టీలు తమ ఉద్దేశాలను ప్రజలకు చెప్పాలంటే.. మీడియాను వాడే మార్గాలు అనేకం ఉన్నాయి. నిజంగా ప్రజా సమస్యలపై దృష్టిసారించేటట్లయితే.. వాటిపై పోరాటం చేసి వాస్తవాలను వెల్లడిస్తే ప్రజలు వాటిని అంగీకరిస్తారు. అంతేగానీ.. మీడియా సంస్థలను అడ్డుకునే చర్యల్లో భాగంగా దాడులకు పాల్పడటం సరైన మార్గం కాదు. రాజకీయ పార్టీలు వారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లడంలో సమర్థవంతంగా ఉండాలి. మీడియా సంస్థలపై దాడి చేయడం లేదా వాటిని నియంత్రించడమనేది ఆలోచనాపరమైన స్వేచ్ఛను దెబ్బతీయడమే.


ఇవీ చదవండి:

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఇలాంటి సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్: ఏపీ మంత్రులు

Updated Date - Apr 07 , 2026 | 01:23 PM