Share News

అలాంటి వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లింది: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:47 PM

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నించిన మీడియాపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

అలాంటి వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లింది: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

అమరావతి, ఏప్రిల్ 7: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై(ABN Andhrajyothy) వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఖండించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన మీడియాపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ పాలనలో మీడియా సంస్థలపై అనేక వేధింపులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు రౌడీ మూకలతో మీడియా కార్యాలయాలపైకి వెళ్లడం దారుణమని మంత్రి అన్నారు.


వైసీపీ రౌడీ రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బెదిరింపులు, దాడులతో మీడియాను భయపెట్టే రోజులు పోయాయన్నారు. దాడులు, ఒత్తిళ్లకు భయపడకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. మీడియాను నడిపిస్తున్నారని తెలిపారు. ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. మహిళల పట్ల వైసీపీ నాయకుల వైఖరిని ప్రజలు మర్చిపోరని తెలిపారు. మీడియాను అణగదొక్కే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏబీఎన్‌ సంస్థలపై వైసీపీ దాడులు.. ఖండించిన నేతలు

ఇలాంటి సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్: ఏపీ మంత్రులు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 01:17 PM